Skip to main content

Jobs at Andhra University: ఏయూలో ఉద్యోగాలు

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌... రేపు ఏయూలో జాబ్ మేళా నిర్వ‌హిస్తున్నారు. ఉద్యోగం చేయాల‌న్న ఆశక్తి గ‌ల వారు ఏయూ వెబ్సైట్ కు సంప్ర‌దించి వారి వివరాల‌ను ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకోండి..
andhra university offers jobs for unemployees
andhra university offers jobs for unemployees

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌, గైడెన్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉదయం 10.30 గంటలకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ చీఫ్‌ కె.దొరబాబు తెలిపారు. డబ్ల్యూఎన్‌ఎస్‌ సంస్థలో నాన్‌ వాయిస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అర్హులు. 20 ఖాళీలను భర్తీ చేస్తారు. 20 నుంచి 35 ఏళ్లు ఉండాలి. నెలకు రూ.16 వేల వేతనం అందిస్తారు.

Indian Airforce Recruitment 2023 : అగ్నివీర్‌ పోస్టులకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే !

 

బజాజ్‌ క్యాపిటల్‌ సంస్థలో సేల్స్‌, టెలీ, మార్కెటింగ్‌ ఉద్యోగాలకు ఇంటర్‌, డిప్లమో, డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులు. మొత్తం 12 ఖాళీలు భర్తీ చేస్తారు. 20 నుంచి 35 ఏళ్లు ఉండాలి. వీరికి వేతనంగా రూ.10వేల నుంచి 13 వేలు అందిస్తారు. అర్హత కలిగిన వారు www.ncs. gov.in/లో వివరాలు నమోదు చేసుకుని, ఇంటర్వ్యూకు హాజరు కావాలని దొరబాబు కోరారు. ఇతర సమాచారం కోసం 96660 92491లో సంప్రదించవచ్చు.
 

Published date : 06 Sep 2023 04:24PM

Photo Stories