AP EDCET 2024 Notification: ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇవే..
ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ పరీక్ష ద్వారా బీఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తరపున విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎడ్ సెట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు
ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్థులు అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుం: రూ. 650 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులైతే రూ. 500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 450 చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేది: ఏప్రిల్ 18 నుంచి
అప్లికేషన్‌కు చివరి తేది: మే 15 వరకు
ఆలస్య రుసుము రూ.1000తో దరఖాస్తులకు చివరితేది: 19.05.2024
ఆలస్య రుసుము రూ.2000తో దరఖాస్తుకు చివరితేది: 21.05.2023.
హాల్‌టికెట్స్ విడుదల: మే 30 నుంచి
ఎడ్‌సెట్ పరీక్ష తేది: జూన్8న
పరీక్ష సమయం: ఉదయం 9-11 గంటల వరకు
వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/