Skip to main content

Indian Airforce Recruitment 2023 : అగ్నివీర్‌ పోస్టులకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే !

కొరుక్కుపేట: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అగ్నిపథ్‌ స్కీమ్‌ కింద అగ్నివీర్‌ వాయు రిక్రూట్‌ మెంట్‌ –2024 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌
ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చైన్నెలో ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలకు 2003 జూన్‌ 27 నుంచి 2006 డిసెంబర్‌ 27 తేదీలోపు పుట్టిన భారతీయ అవివాహిత పురుషులు, మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని అందులో పేర్కొన్నారు. దరఖాస్తులకు ఈనెల 17 తేదీతో గడువు ముగుస్తుందని ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందని మరిన్ని వివరాలకు htt ps:agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను చూడవచ్చునని సూచించారు.

Also read: Admissions in Andhra University: యోగా శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 10 Aug 2023 03:38PM

Photo Stories