Admissions in Andhra University: యోగా శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
బొబ్బిలి: యోగా కోర్సులో పీజీ, పీజీ డిప్లమో, పీహెచ్‌డీ కోర్సులకు ఆంధ్రా యూనివర్సిటీ ఆహ్వానం పలుకుతోందని పట్టణంలోని శ్రీయోగ విద్యాసంస్థ కోర్సు డైరెక్టర్లు ఎంఈవీ ప్రసాద్, కె.సత్య తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మా శ్రీ యోగా సంస్థలో ఆరు నెలల డిప్లొమో కోర్సులో శిక్షణ ఇచ్చేందుకు ఎంఓయూ కుదిరించదన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఆంధ్రాయూనివర్సిటీ అనుమతించిన ఏకై క యోగా విద్యా సంస్థ తమదేనన్నారు.ఆరు నెలల యోగా కోర్సు కోసం రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 డీడీ తీసి చేరాలని సూచించారు. రూ.10వేల కోర్సు ఫీజుతో ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉందన్నారు, మా సంస్థకు ఎటువంటి రుసుమూ చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలోని విజయనగరం ప్యాలస్ ద్వారా కోర్సుకు అప్‌లై చేసుకోవాలని, లేదా ఫోన్ 9988229011,7013969066 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Also read: University: విద్యతోనే అభివృద్ధి: సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి
Published date : 08 Aug 2023 03:19PM