University: విద్యతోనే అభివృద్ధి: సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి
శ్రీకాకుళం అర్బన్: విద్యతోనే ఆర్థికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి సాధించవచ్చని ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. శ్రీకాకుళంలోని ఎన్‌జీఓ కార్యాలయంలో ఆదివా రం ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు ఇదివరకు భూములు, నగలు ఇచ్చే వారని ఇప్పుడు ఒక్క విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ తమ బిడ్డలను చక్కగా చదివించాలని భావిస్తున్నారన్నారు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోతున్నాయని, అందుకు కారణం పరీక్షల సమయంలో పేపర్ లీకేజీల వ్యవహారమని చెప్పారు. దీన్నే ఇతివృత్తంగా తీసుకుని ‘యూనివర్సిటీ’ పేరుతో సినిమా తీశానన్నారు.
Also read: Degree New Curriculum 2023: డిగ్రీ కోర్సుల్లో 190కు పైగా సింగిల్ మేజర్ సబ్జెక్ట్‌లు
సెప్టెంబర్, లేదా అక్టోబర్‌లో ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తానని చెప్పారు. ఈ సినిమాను తల్లిదండ్రులంతా చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత రోజుల్లో ఇంగ్లిష్ మీడియంకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నా రు. తెలుగు భాషను కాపాడుకుంటునే ఇంగ్లిష్‌ను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లిష్ మీడియంకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సమావేశంలో ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు, సీఐటీయూ నాయకుడు వీజీకె మూర్తి తదితరులు ఉన్నారు.
Also read: Talent Awards: ఉత్తమ విద్యార్థులకు పురస్కారాల అందజేత