Skip to main content

After 10th Class After ITI Courses Job Opportunities : టెన్త్ త‌ర్వాత బెస్ట్‌ ఐటీఐ కోర్సులు.. వ‌చ్చే ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ జాబ్స్‌ ఇవే ! నెల‌కు రూ.90 వేలకు పైగానే..

త్వ‌ర‌లోనే తెలుగు రాష్ట్రాల్లో.. ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఇప్ప‌టికే చాలా మంది విద్యార్థులు ఇంట‌ర్‌, ఐటీఐ మొద‌లైన కోర్సుల్లో జాయిన్ అయితే.. కెరీర్ ఎలా ఉంటుంది.? ఏ కోర్సుకు.. ఎలాంటి ఉద్యోగం వ‌స్తుంది..? అనే ఆలోచ‌న‌లో ఉంటారు. ఈ నేప‌థ్యంలో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) టెన్త్ తరవాత ఐటీఐ కోర్సుల్లో జాయిన్ అవ్వాల‌నుకునే విద్యార్థుల కోసం.. ప్రముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ముఖ్య‌మైన సూచ‌న‌లు-స‌ల‌హాలు మీకోసం..
ITI Courses and Job Opportunities

చాలా మంది విద్యార్థులు టెన్త్ తర్వాత‌ ఐటీఐ కోర్సులు చేసిన వాళ్లు తొందరగానే లైఫ్‌లో సెటిల్ అయిపోతున్నారు. కేంద్రం ప్ర‌భుత్వ‌ పరిధిలోని పలు సంస్థల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. 

ఐటీఐ కోర్సుల్లో ప్ర‌వేశం ఎలా..?

Types of ITI Courses in Telugu

తక్కువ వ్యవధిలో నైపుణ్యాలు సాధించి.. తొందరగా స్థిరపడాలనుకునే వాళ్లు ఐటీఐ కోర్సుల‌ను ఎంచుకోవచ్చు. ఇండస్ట్రియల్ సెక్టార్‌లో నిపుణుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించి పెట్టిందే ఈ ఐటీఐ కోర్స్. పదో తరగతి చదివిన వాళ్లెవరైనా ఇందులో చేరేందుకు అర్హులు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఐటీఐలో చేరిపోవచ్చు. పదోతరగతిలో సాధించిన మార్కుల‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఐటీఐ చేయాలనుకునే విద్యార్థుల‌కు.. దేశవ్యాప్తంగా 130కిపై కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

చ‌ద‌వండి: What after Inter/10+2... ఎంపీసీ... మెరుగైన మార్గాలెన్నో

తెలుగు రాష్ట్రాల్లో..
ఇవి కేంద్రం ప్ర‌భుత్వ‌ పరిధిలోని ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ITI అంటే.. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌. ఐటీఐ కోర్సుల్లో.. ఎంపిక‌ ఆధారంగానే ఏడాది లేదా రెండేళ్లుగా వ్య‌వ‌ధి ఉంటుంది. ఇంజనీరింగ్‌తో పాటు నాన్ ఇంజనీరింగ్ విభాగంలోనూ ఐటీఐ కోర్స్ చేసేందుకు వీలుంటుంది. 

☛ After 10th Class Best Polytechnic Courses : టెన్త్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈ పాలిటెక్నిక్ కోర్సుల‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు ఇవే..!

దాదాపు 50కి పైగా స్పెషలైజేషన్ కోర్సులు..
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50కి పైగా స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి ఆసక్తి మేరకు ఏడాది లేదా రెండేళ్ల కోర్స్‌లను ఎంపిక చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, వెల్డర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్ తదితర కోర్స్‌ల వ్యవధి ఏడాది పాటు ఉంటుంది. ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, కెమికల్ ప్లాంట్‌లో ఆపరేటర్ తరహా కోర్స్‌ల వ్యవధి రెండేళ్లు ఉంటుంది. 

చ‌ద‌వండి: Careers After Inter BiPC: మెడిసిన్‌తోపాటు మరెన్నో!

ఇంకా ఉన్నత చదువులు చదవాలనుకునే వారు..
ఐటీఐ పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువ‌గానే ఉంటాయి. ఉన్నత చదువులు చదవాలనుకునే వారు డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు. అలాగే లేటరల్ ఎంట్రీతో కొన్ని బ్రాంచ్‌లలో డిప్లొమా సెకండ్ ఇయర్‌లో జాయిన్ అవచ్చు. డిప్లొమా త్వ‌రాత‌ కూడా ఈసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ కోర్సులో.. నేరుగా సెకండ్ ఇయర్‌లో చేరొచ్చు. 

PSU సంస్థల్లో ఐటీఐ చేసిన వారికి..

iti students in psus news in telugu

ఐఐటీ కోర్సు పూర్తి చేసిన వాళ్లు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో శిక్షణ తీసుకోవచ్చు. అప్రెంటిస్‌ చేసిన వాళ్లకు పలు సంస్థల్లో ప్రాధాన్యత ఉంటుంది. నవరత్న, మహారత్న లాంటి PSU సంస్థల్లో ఐటీఐ చేసిన వారికి అప్రెంటిస్ అవకాశాలు కల్పిస్తున్నారు. రైల్వేలోనూ అప్రెంటిస్‌లకు అవకాశాలు లభిస్తున్నాయి. ఇంకా.. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ వల్ల ఐటీఐ చేసిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. పరిశ్రమలు, తయారీ సంస్థలు, రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఐటీఐ చేసిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. 

☛ Intermediate Academic Calendar 2024-25 : ఇంట‌ర్ అకడమిక్ కేలండర్ 2024-25 ఇదే.. ప‌రీక్ష‌లు.. సెల‌వుల ఇలా..

సొంతంగా పనులు చేసుకుంటూ.. చేతి నిండా సంపాదించుకోవచ్చు ఇలా..
అలాగే ఐటీఐ విద్యార్థుల‌కు.. విద్యుత్ రంగంలో లైన్‌మెన్ ఉద్యోగాల‌కు వీళ్లు అర్హులు. ఎలక్ట్రికల్ కోర్స్ చేసిన వాళ్లు జూనియర్ లైన్‌మెన్‌ పోస్ట్‌లకు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. స్టీల్‌ప్లాంట్‌లు, పోర్ట్‌ల్లోనూ ఐటీఐ చేసి వారికి డిమాండ్ ఉంది. ఇదే కాకుండా స్వయం ఉపాధి కూడా పొందొచ్చు. నగరాల్లో ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్ తదితర పనులు చేసే వారికి బాగానే డిమాండ్ ఉంటోంది. ఐటీఐ కోర్స్‌తో నైపుణ్యాలు సాధించిన వారు ఇలా సొంతగానూ పనులు చేసుకుంటూ చేతి నిండా సంపాదించుకోవచ్చు. కొన్ని సంస్థలు సర్టిఫికెట్‌లు అందించి ఐటీఐ చేసిన వాళ్లను అవసరాల ఆధారంగా విదేశాలకూ పంపుతున్నాయి.

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

ఆంధ్రప్రదేశ్‌లోనే వచ్చే నాలుగేళ్లలో..

iti students jobs news in telugu

ఐటీఐ చదువులు పూర్తి చేసిన విద్యార్థులు స్కిల్డ్‌ వర్కర్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రులు, బ్యాంకులు, రియల్‌ ఎస్టేట్‌తో పాటు నిర్మాణరంగంలో స్కిల్డ్‌ వర్కర్ల అవసరం భారీగా ఉండబోతోంది. ఎన్‌ఎస్‌డీసీ(నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే వచ్చే నాలుగేళ్లలో 41.41 లక్షల మంది స్కిల్డ్‌ వర్కర్ల అవసరం ఉండబోతోంది. అయితే ఏడాదికి 2.85 లక్షల మందే అందుబాటులో ఉంటున్నారు. దేశవ్యాప్తంగా కియా, హుండాయి, మారుతి, హరీ మోటార్స్‌ లాంటి ఆటోమొబైల్‌తో పాటు అన్ని రంగాల్లో కూడా ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో నిపుణులైన వారికి ఉద్యోగ అవకాశాలున్నాయి. కారు, బైక్‌ మెకానిక్, నిర్మాణరంగంలో ఫిట్టింగ్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో పనిచేసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది.ఇటీవల ఈ రంగాల్లో పని నేర్చుకునే ఆసక్తి తగ్గుతోంది.

చ‌ద‌వండి: Integrated B.Tech Courses After 10th: పదితోనే.. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. మ్యాథ్స్‌ మార్కులు ముఖ్యం

నెల‌కు రూ.90 వేలకు పైగానే..

it jobs news telugu

మెకానిక్‌ నుంచి ఎలక్ట్రికల్, ఫిట్టర్ల వరకూ అసిస్టెంట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎలక్ట్రిషియన్‌ ఒక ఇంటికి కరెంట్‌ పని చేస్తే 2–4 రోజుల్లో పూర్తవుతుంది. దీనికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు తీసుకుంటున్నారు. నెలలకు కనీసం 5 కొత్త ఇళ్లకు ఎలక్రికల్‌ పని చేస్తే రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది. బైక్‌ మెకానిక్, ఫిట్టర్లు కూడా రోజూ కనీసం రూ.3వేలు తక్కువ లేకుండా సంపాదిస్తారు. అంటే వీరి సంపాదన కూడా నెలకు రూ.90 వేలకుపైనే.

☛ Best Course of Intermediate : 'ఇంటర్‌'లో ఏ గ్రూపులో జాయిన్ అయితే.. బెస్ట్ కెరీర్ ఉంటుందంటే..?

Published date : 05 Apr 2024 07:41PM

Photo Stories