Skip to main content

Careers After Inter BiPC: మెడిసిన్‌తోపాటు మరెన్నో!

best career options after intermediate bipc
best career options after intermediate bipc

‘బైపీసీ’..! తర్వాత ఏంటి?! అంటే... విద్యార్థుల నుంచి టక్కున వచ్చే సమాధానం.. ఎంబీబీఎస్‌లో చేరడం. అది కుదరకపోతే బీడీఎస్‌లోనైనా సీటు సొంతం చేసుకోవడం. తద్వారా వైద్య వృత్తిలో స్థిరపడేందుకు అడుగులు వేయడం!! ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో ప్రవేశం పొందాలంటే.. జాతీయ స్థాయిలో జరిగే నీట్‌లో విజయం సాధించడం తప్పనిసరి. అందుకోసం బైపీసీ విద్యార్థులు.. ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే కృషి చేస్తుంటారు. ఒకవేళ నీట్‌లో ర్యాంకు రాకుంటే.. భవిష్యత్తు అగమ్యగోచరమేనా? అని ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి బైపీసీ విద్యార్థులకు.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు అనేక కోర్సులు, కెరీర్‌ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి!! ఈ నేపథ్యంలో.. బైపీసీతో కెరీర్‌ మార్గాలపై ప్రత్యేక కథనం... 

  • ఇంటర్‌ బైపీసీ అర్హతగా విభిన్న కోర్సులు
  • విద్యార్థుల తొలి ప్రాధాన్యం ఎంబీబీఎస్, బీడీఎస్‌
  • అందుబాటులో అనేక కెరీర్‌ అవకాశాలు

తొలి లక్ష్యం ఎంబీబీఎస్‌

ఎంబీబీఎస్‌.. బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడిసిన్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సర్జరీ. ఇది బైపీసీ విద్యార్థులకు తొలి లక్ష్యంగా నిలుస్తున్న కోర్సు. ఇందులో చేరాలంటే.. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌–యూజీ ఎంట్రన్స్‌లో ర్యాంకు సొంతం చేసుకోవాలి. ఆ తర్వాత జరిగే కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు ఖరారు చేసుకోవాలి.
ఈ కోర్సు వ్యవధి అయిదున్నరేళ్లు. కోర్సులో భాగంగా ప్రీ–క్లినికల్, పారా–క్లినికల్, క్లినికల్‌ విభాగాలపై అగాహన కల్పిస్తారు. ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక పీజీ, సూపర్‌ స్పెషాలిటీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో చేరొచ్చు. పీజీ స్థాయిలో చేరేందుకు విద్యార్థులు నీట్‌–పీజీ ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. ఎండీ లేదా ఎంఎస్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. డీఎన్‌బీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌గా(డీఎం)గా పేర్కొనే ఈ కోర్సులను వైద్య రంగంలో డాక్టరేట్‌ డిగ్రీలుగా పరిగణిస్తారు. డీఎం, ఎంసీహెచ్, డీఎన్‌బీ వంటి సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో చేరాలనుకునే వారు నీట్‌–ఎస్‌ఎస్‌ ఎంట్రన్స్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది.

After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!

బీడీఎస్‌

బీడీఎస్‌... బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీగా పిలిచే ఈ కోర్సును పూర్తి చేసుకుంటే.. ఎంబీబీఎస్‌కు దీటుగా అవకాశాలు అందుకోవచ్చు. ఈ కోర్సులో చేరాలంటే.. నీట్‌–యూజీ ర్యాంకు ద్వారా కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి. మెరిట్, అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఉన్నత విద్యలో ప్రధానంగా అందుబాటులో ఉండే కోర్సు.. ఎండీఎస్‌(మాస్టర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ). ఈ కోర్సులో పలు స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎండీఎస్‌లో చేరాలంటే.. నీట్‌–పీజీ ఎంట్రన్స్‌లో ర్యాంకు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఎండీఎస్‌తోపాటు డెంటల్‌ మెడికల్‌ కేర్‌ విభాగంలో అందుబాటులో ఉన్న మరో అవకాశం.. పీజీ డిప్లొమా. రెండేళ్ల వ్యవధిలో ఉండే ఈ పీజీ డిప్లొమా కోర్సులు పూర్తి చేయడం ద్వారా చక్కటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

AYUSH Counseling: అందుబాటులో ఉన్న కళాశాలలు, ఫీజుల వివ‌రాలు ఇలా..

ఆయుష్‌ కోర్సులు

వైద్య రంగంలో స్థిరపడాలని నిశ్చయించుకున్న వారికి ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.. ఆయుష్‌ కోర్సులు. ఆయుర్వేదం, యోగా అండ్‌ నేచురోపతి, యునాని, సిద్ధ యోగ, హోమియోపతిలనే సంక్షిప్తంగా ఆయుష్‌ కోర్సులుగా పిలుస్తారు. ఇటీవల కాలంలో ఆయుష్‌ విభాగాలకు కూడా ఆదరణ పెరుగుతోంది.

బీహెచ్‌ఎంఎస్‌

బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ సంక్షిప్తంగా.. బీహెచ్‌ఎంఎస్‌. ఎంబీబీఎస్, బీడీఎస్‌ తర్వాత ఆదరణ పొందుతున్న కోర్సు ఇది. ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్‌ కరిక్యులంలో ఉండే విభాగాలు ఉంటాయి. బీహెచ్‌ఎంఎస్‌ అర్హతతోనే నెలకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు వేతనంతో కొలువు సొంతం చేసుకోవచ్చు. ఉన్నత విద్యలో.. పీజీ స్థాయిలో మెటీరియా మెడికా, హోమియోపతిక్‌ ఫిలాసఫీ వంటి స్పెషలైజేషన్లకు డిమాండ్‌ నెలకొంది. వీటిని కూడా పూర్తి చేస్తే భవిష్యత్తులో ఉపాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

బీఏఎంఎస్‌

ఆయుష్‌ కోర్సుల్లో మరో ప్రత్యేకమైనది.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ(బీఏఎంఎస్‌). ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, జనరల్‌ మెడిసిన్‌ తదితర సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. వీటిలో నైపుణ్యం ద్వారా సహజ సిద్ధ ప్రక్రియలతో రోగులకు వైద్యం చేయగలిగే పట్టు లభిస్తుంది. ఉన్నత విద్యలో.. ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్‌–ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. ఎంబీబీఎస్‌లోని జనరల్‌ మెడిసిన్‌కు సరితూగే కాయ చికిత్స, జనరల్‌ సర్జరీకి సరితూగే శల్యతంత్ర కోర్సులు పీజీ స్పెషలైజేషన్లుగా ఉన్నాయి.

After Inter: సరైన కెరీర్‌కు సోపానాలు.. 

యునానీ (బీయూఎంఎస్‌)

ప్రకృతి వైద్యంగా భావించే కోర్సు.. బీయూఎంఎస్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ యునానీ మెడికల్‌ సైన్స్‌). బీయూఎంఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత విద్యలో ఎండీ, ఎంఎస్‌ కోర్సులు చదివే అవకాశం ఉంది.

బీఎన్‌వైఎస్‌

బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతిక్‌ మెడికల్‌ సైన్సెస్‌.. బీఎన్‌వైఎస్‌. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. 

ఆయుష్‌ కూడా నీట్‌ స్కోర్‌తోనే

ఆయుష్‌ కోర్సులకు కూడా జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌–యూజీ(అండర్‌ గ్రాడ్యుయేషన్‌) స్కోర్‌ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తున్నారు. నీట్‌–యూజీ స్కోర్‌తో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక.. ఆయుష్‌ కోర్సులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. వచ్చిన దరఖాస్తులు, సీట్లు, విద్యార్థుల ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుంటూ.. సీట్ల కేటాయింపు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్, ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లు ఈ ప్రక్రియను చేపడతాయి. 

  • వివరాలకు వెబ్‌సైట్స్‌: ntruhs.ap.in knruhs.telangana.gov.in

‘డాక్టర్‌’ కల నెరవేర్చే.. బీవీఎస్‌సీ

బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ..బీవీఎస్‌సీ. బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సు ఇది. జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, పశువుల గర్భధారణ పద్ధతులు తదితర అంశాల్లో నైపుణ్యం కల్పించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేయడం ద్వారా ఫౌల్ట్రీ ఫారాలు, ప్రభుత్వ, ప్రైవేటు పశువైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు, వన్యమృగ సంరక్షణ కేంద్రా లు,జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్, గొర్రెల పెంపకకేంద్రాల్లో ఉపాధి లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సు.. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణలో పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో అందుబాటులో ఉంది. పీజీ స్థాయిలోనూ పలు స్పెషలైజేషన్లు అభ్యసించే అవకాశం ఉంది.

  •  వివరాలకు వెబ్‌సైట్స్‌: www.tsvu.nic.in, www.SVVU.edu.in

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ.. సంక్షిప్తంగా బీపీటీ. వైద్యరంగంలో స్థిరపడాలనుకునే వారికి మరో చక్క టి ప్రత్యామ్నాయం. ఈ కోర్సు పూర్తిచేస్తే ఫిజియోథెరపిస్ట్‌లుగా ఉపాధి పొందొచ్చు. అదే విధంగా స్వయం ఉపాధి అవకాశాలు కూడా అందుకోవచ్చు. 

Job Opportunities: అగ్రికల్చర్‌ కోర్సులు.. అందించేను అవకాశాలు

అగ్రికల్చర్‌ బీఎస్సీ

అగ్రి బీఎస్సీ.. బైపీసీ విద్యార్థులకు మరో చక్కటి కోర్సు. వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు తదితరాల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ విభాగంలో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ వంటి కొలువులు సొంతం చేసుకోవచ్చు. బ్యాంకుల్లో సైతం రూరల్‌ బ్యాంకింగ్‌ విభాగంలో ఆఫీసర్‌ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (ఏపీ), ఆచార్య జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ ఈ కోర్సును అందిస్తున్నారు. 

Paramedical Courses: ఈ కోర్సులో చేరితే.. కొలువు పక్కా! ఉద్యోగం కాదనుకుంటే...

పారామెడికల్‌

బైపీసీ విద్యార్థులకు తక్షణ ఉపాధి అందించేవి పారామెడికల్‌ కోర్సులు. వీటిలో ప్రధానంగా న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ, ఆప్టోమెట్రిక్‌ టెక్నాలజీ, రెనాల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ, పెర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ, కార్డియాక్‌ కేర్‌ టెక్నాలజీ అండ్‌ కార్డియో వ్యాస్కులర్‌ టెక్నాలజీ, అనెస్థీషియాలజీ టెక్నాలజీ అండ్‌ ఆపరేషన్‌ థియటర్‌ డిగ్రీ, ఇమేజింగ్‌ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా హాస్పిటల్స్‌లో ఆయా విభాగాల్లో టెక్నీషియన్స్‌గా స్థిరపడొచ్చు. పారామెడికల్‌ కోర్సులను కూడా హెల్త్‌ యూనివర్సిటీలే పర్యవేక్షిస్తాయి. వీటికి ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తాయి. 

After‌ Inter‌ BiPC: అవకాశాలు భేష్‌!

బీఎస్‌సీ నర్సింగ్‌

బైపీసీ విద్యార్థులకు.. కెరీర్‌ గ్యారెంటీ కోర్సు.. బీఎస్సీ నర్సింగ్‌. ఈ కోర్సు ఉత్తీర్ణులు నేరుగా నర్సులుగా కెరీర్‌ ప్రారంభించొచ్చు. ఉన్నత విద్యలో.. పీజీ స్థాయిలో ఎమ్మెస్సీ నర్సింగ్‌ అందుబాటులో ఉంది. రెండేళ్ల వ్యవధిలోని ఈ కోర్సులో మెడికల్‌ సర్జన్‌ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, పిడియాట్రిక్స్, సైకియాట్రిక్‌ నర్సింగ్, ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ నర్సింగ్, మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్‌ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీరికి ఆస్పత్రుల్లో, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సూపర్‌వైజర్ల స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రస్తుతం నర్సింగ్‌ కోర్సులను రాష్ట్రాల స్థాయిలో.. హెల్త్‌ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలతోపాటు జాతీయ స్థాయిలోనూ పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో చదివే అవకాశం ఉంది. 

బీఎఫ్‌ఎసీ

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ సంక్షిప్తంగా.. బీఎఫ్‌ఎస్‌సీ. మత్స్య సంరక్షణ, సేకరణ వంటి విషయాల్లో ప్రత్యేక పద్ధతులు, శాస్త్రీయ విధానాలకు సంబంధించిన నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆక్వాకల్చర్‌ సంస్థలు, ఆక్వా రీసెర్చ్‌ కంపెనీలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. తెలంగాణలో పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

బీటెక్‌–ఫుడ్‌ టెక్నాలజీ

బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో కోర్సు..బీటెక్‌–ఫుడ్‌ టెక్నాలజీ. ఇది ఆహార ఉత్పత్తుల తయారీ,నాణ్యత,ప్రాసెసింగ్‌ సంబంధిత నైపుణ్యాలు అందిస్తుంది. ఈ కోర్సును పూర్తి చేసుకుంటే..ఫుడ్‌ ప్రొడక్షన్‌ యూనిట్స్, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థల్లో కొలువుదీరొచ్చు. గత రెండు, మూడేళ్లుగా ఈ–కామర్స్‌ సంస్థల్లో బీటెక్‌–ఫుడ్‌ టెక్నాలజీ విద్యార్థులకు కొలువులు లభిస్తున్నాయి. 

బీఎస్‌సీ(సీఏబీఎం)

బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ కమర్షియల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌.. సంక్షిప్తంగా సీఏబీఎం. బైపీసీ విద్యార్థులకు కార్పొరేట్‌ కొలువులకు మార్గం వేసే కోర్సు ఇది. వ్యవసాయ విధానంలో ఆధునిక పద్ధతులను అన్వయించడం, వాటి ద్వారా లాభదాయకత పెరిగేలా చేయడానికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్, క్రాప్‌ పొడక్షన్‌ కంపెనీలలో మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. 

అగ్రి కోర్సులు.. సీట్ల భర్తీ ఇలా

వ్యవసాయ సంబంధ కోర్సులను తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నాయి.ఎంసెట్‌(అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌)ర్యాంకు ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్ల భర్తీ చేస్తాయి. 

బీఎస్సీ (బీజెడ్‌సీ)

బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న సంప్రదాయ డిగ్రీ కోర్సు.. బీఎస్సీ (బీజెడ్‌సీ). బీజెడ్‌సీలోనూ మైక్రోబయాలజీ, జెనెటిక్స్, హ్యూమన్‌ జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌ వంటి వినూత్న కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. బీఎస్సీ తర్వాత సంబంధిత స్పెషలైజేషన్లతో పీజీతో లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో కొలువులు దక్కించుకోవచ్చు. రీసెర్చ్‌ ఔత్సాహికులకు అనుకూలంగా నిలుస్తున్న కోర్సు బీఎస్సీ బీజెడ్‌సీ. బీఎస్సీ తర్వాత ఇంటిగ్రేటెడ్‌ పీజీ+పీహెచ్‌డీ కోర్సులు చేసే అవకాశం ఉంది. అనంతరం ప్రముఖ రీసెర్చ్‌ ల్యాబ్స్‌లో సైంటిస్ట్‌లుగా కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు.

After Inter BiPC: వెటర్నరీ సైన్స్‌తో ఉద్యోగావకాశాలు.. బీవీఎస్సీతో డాక్టర్‌ హోదా పొందొచ్చు...

Published date : 21 Jun 2022 05:29PM

Photo Stories