Skip to main content

Degree New Curriculum 2023: డిగ్రీ కోర్సుల్లో 190కు పైగా సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌లు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): సాధారణ డిగ్రీ కోర్సుల మొదటి ఏడాది తరగతులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కళాశాలల్లో డిగ్రీ కోర్సులను అభ్యసించే వారికి 2021 వరకూ కళాశాల యజమాన్యాలే నేరుగా అడ్మిషన్లను నిర్వహించుకునేవి. కానీ 2022 –2023 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తోంది.
నేటి నుంచి ‘డిగ్రీ ఆనర్స్‌’ ఆరంభం
నేటి నుంచి ‘డిగ్రీ ఆనర్స్‌’ ఆరంభం

రాష్ట్రంలో అన్ని కళాశాలల్లో ప్రభుత్వమే విద్యార్థులు ఎంపిక చేసుకున్న కోర్సులను, వారు ఎంపిక చేసిన కళాశాలల్లో వారివారి మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఆన్‌లైన్‌లో కేటాయిస్తోంది. ఈ ఏడాది ఆ ప్రక్రియలో భాగంగా మొదటి విడత కేటాయింపులు ఏడో తేదీతో ముగించనుంది. ఐదు, ఆరు ఏడు తేదీల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు వారివారి కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలని అదే రోజున తరగతులను ప్రారంచాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది.

Also read: Bank Employees: ‘సహకార’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

నెల రోజులు ఆలస్యంగా..

ఉన్నత విద్యామండలి వాస్తవంగా జూలై నాలుగో తేదీన మొదటి విడత ఆన్‌లైన్‌ సీట్ల కేటాయింపు ముగించి అదే రోజు తరగతులను ప్రారంభించాలని నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో సరిగ్గా సీట్ల కేటాయింపులు జరగకపోవటంతో, ఆశించిన స్థాయిలో విద్యార్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేకపోవటం, పూర్తి స్థాయిలో అవగాహన రాకపోవటంతో రెండు మూడు దఫాలుగా తేదీలను మార్చుకుంటూ వచ్చింది.

Also read: AP Engineering Counseling: వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం

150 సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌లు

ఈ ఏడాది ప్రారంభం కానున్న డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు నూతన కరిక్యులమ్‌తో ఆరంభం కానున్నాయి. ఒక సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌ మరో మైనర్‌ సబ్జెక్ట్‌ను విద్యార్థి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వివిధ కళాశాలల్లో సుమారు 190కు పైగా సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌లను ఆయా కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో అందిస్తున్నారు. అలాగే మరో 80 వరకూ మైనర్‌ సబ్జెక్ట్‌లను అందిస్తున్నారు. అందులో ఉమ్మడి కృష్ణాజిల్లాలో కోర్సులకు ఆమోదం తెలిపే కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 150కు పైగా సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Also read: Student Speaks Up!:Sharing insights into the Jagananna Videshi Vidya Deevena Scheme 

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 90 డిగ్రీ కళాశాలలు

కృష్ణావిశ్వవిద్యాలయం పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో సుమారు 120 వరకూ వివిధ కోర్సులను అందించే కళాశాలలు కొనసాగుతున్నాయి. అందులో 90 వరకూ కళాశాలలు సాధారణ డిగ్రీ కోర్సులను విద్యార్థులకు అందిస్తున్నాయి. ఈ కళాశాలల్లో సుమారు 20 వేల వరకూ మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులో చేరే విద్యార్థులకు అవకాశముంది. అయితే మొదటి విడత కేటాయింపులో దాదాపుగా 50 శాతానికి పైగా సీట్లును విద్యార్థులకు కేటాయించినట్లు తెలిసింది.

Also read: వివిధ పోటీప‌రీక్ష‌ల్లో మార్కులు తెచ్చే పోర్ట‌ల్స్ ఇవే..| APPSC | TSPSC | CDPO | Important Portals

కృష్ణా వర్సిటీ పరిధిలో 90 కాలేజీల్లో

కోర్సులు

Published date : 07 Aug 2023 04:13PM

Photo Stories