Bank Employees: ‘సహకార’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోషియేషన్ నాయకులు నారాయణరెడ్డి, కేవీఎస్ రవికుమార్ తదితరులు మాట్లాడుతూ... బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, డిమాండ్‌లను చైర్‌పర్సన్ దృష్టికి తెచ్చారు. చైర్‌పర్సన్ విజయమనోహరి మాట్లాడుతూ... జిల్లా సహకార కేంద్రబ్యాంకును అభివృద్ధిలోకి తీసుకరావడంతో బ్యాంకు ఉద్యోగులే కీలకమన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యలు, డిమాండ్‌లను పరిశీలించి పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ విజయమనోహరిని అసోసియేషన్ నేతలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ నంద్యాల రీజినల్ మేనేజర్ శివలీల, డీజీఎం సునీల్‌కుమార్, అసోసియేషన్ నాయకుడు విజయసింహారెడ్డి, పలువురు మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Also read: KGBVల్లో టీచర్లను కొనసాగించాలి.. ఖాళీగా పీజీటీ పోస్టులు
డీసీసీబీ చైర్‌పర్సన్ ఎస్వీ విజయ మనోహరి