Skip to main content

AP Engineering Counseling: వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇంజినీరింగ్‌ కోర్సుల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా సోమవారం వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూలై 24వ తేదీన అధికారులు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అత్యధికంగా 32 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా, నూతన కృష్ణాజిల్లా పరిధిలో ఆయా కళాశాలలు కొనసాగుతున్నాయి.
వెబ్‌ ఆప్షన్లకు వేళాయె
వెబ్‌ ఆప్షన్లకు వేళాయె

ఆయా కళాశాలల్లో సుమారు 19,215 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మశీ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష –2023 ఫలితాలలో 25,714మంది ఉమ్మడి జిల్లాలో క్వాలిఫై అయ్యారు. వీరిలో ఎన్టీఆర్‌ జిల్లా వారు 23,219 మంది, కృష్ణాజిల్లాకు సంబంధించి 2,495 మంది ఉన్నారు.
Also read: Bank Employees: ‘సహకార’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

మూడు హెల్ప్‌లైన్‌ కేంద్రాలు..

విద్యార్థులు తాము సొంతంగా వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. అభ్యర్థులకు ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సాయం అందించేందుకు విజయవాడ నగరంలో మూడు హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పొలిటెక్నికల్‌ కళాశాలతో పాటుగా, ఆంధ్ర లయోల ఇంజినీరింగ్‌ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కళాశాలల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు వెళ్లి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

Also read: Civils Ranker: ఉన్నత స్థానంలోకి వెళ్లాలంటే కష్టపడాల్సిందే.. కష్టపడినపుడే విజయం విలువ తెలుస్తుంది

Published date : 07 Aug 2023 03:55PM

Photo Stories