Skip to main content

Gurukul Admission Exam: ఈ నెల 25న గురుకులంలో ప్రవేశానికి పరీక్ష..!

గురుకులంలో విద్యార్థులు ప్రవేశానికి పరీక్షను రాసేందుకు కింద ప్రకటించిన వెబ్‌సైట్‌ ద్వారా తమ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..
Andhra Pradesh Gurukula Vidyalayas Admission Exam  Admission Examination for Gurukula Schools, Junior Colleges, and Degree Colleges  Andhra Pradesh Gurukula Vidyalayas Association Secretary Narasimha Rao  Entrance exam for admission at gurukul school junior and degree college

 

నంద్యాల: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరం ప్రవేశానికి ఈనెల 25వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి నరసింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

UOH Research Associate Jobs: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు

5, 6, 7, 8 తరగతులకు ఏపీఆర్‌ఎస్‌ Cat–2024 ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, కళాశాలలకు ఏపీఆర్‌జేసీ, డీసీసెట్‌ – 2024 మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షకు సంబంధించిన అభ్యర్థులు హాల్‌టికెట్లను https://aprs.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. అభ్యర్థులు ఐడీతో పాటు పుట్టిన తేదీ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలన్నారు.

UPSC Exam: రేపు యూపీఎస్సీ పరీక్ష నిర్వహణ.. హాజరుకానున్న అభ్యర్థుల సంఖ్య..!

Published date : 20 Apr 2024 12:30PM

Photo Stories