Skip to main content

Driver Jobs: డ్రైవర్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ambulance driver jobs

భువనగిరి : 108, 102 అమ్మఒడి అంబులెన్సులో డ్రైవర్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈఎంఆర్‌ఐ గ్రీన్‌ హెల్త్‌ సర్వీస్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ నసీరుద్దీన్‌ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి 35 సంవత్సరాల వయస్సు లోపున్న వారు అర్హులన్నారు. ఎంపికై న వారికి 10 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. అసక్తి, అర్హత ఉన్న వారు ఈ నెల 24వ తేదీన జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాలలో హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం సెల్‌ నంబర్‌ 9948538540, 8008935533ను సంప్రదించాలని కోరారు.


చ‌ద‌వండి: ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Published date : 23 Jun 2023 07:24PM

Photo Stories