ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
శిక్షణ కోసం రిజర్వేషన్ ప్రకారం మహిళలకు 33.33 శాతం, అన్ని రిజర్వు కేటగిరీలో దివ్యాంగులకు 5 శాతం సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర మైనార్టీ స్టడీసర్కిల్‌లో మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులందరూ ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రవేశం కోసం సాధారణ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసిన మైనార్టీ అభ్యర్థులు ఈనెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు www.cet.cgg.gov.in/tmreis వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, జూలై 23న జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు.మిగతా వివరాల కోసం 040–23236112 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి
గద్వాల అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఉస్మానియా యూనివర్శిటీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రాజు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.5,300 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమించాలన్నారు. ప్రైవేయిట్ పాఠశాలలు, కళాశాలల్లో అక్రమంగా నోట్ బుక్కులు, పుస్తకాలు విక్రయిస్తున్నారని వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అశోక్, రఘువంశీ, సురేష్, గణేష్, మహేష్, శ్రీకాంత్, తేజ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.