Education Week Program : ఈ నెల 22 నుంచి 28 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 'శిక్షా సప్తాహ్' కార్యక్రమం..
విజయనగరం: కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ 2020) ప్రవేశపెట్టి నాలుగేళ్లు పూర్తవుతోంది ఈ సందర్భంగా వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ (విద్యావారం) కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జాతీయ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత పరివర్తనాత్మక సంస్కరణలపై, దేశవ్యాప్తంగా విద్యాభివృద్ధిలో నిబద్ధతను తెలియజేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని జిల్లా విద్యాశాఖ ప్రకటించింది.
AP Govt Schools : ఇకపై సర్కారు బడుల్లో తెలుగు మీడియం మాత్రమేనా..!
అప్పటివరకు ఉన్న 10+2+3 విద్యా విధానం బదులు డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ సిఫార్సుల మేరకు నూతన జాతీయ విద్యా విధానం రూపకల్పన చేశారు. ఈ ఎన్‌ఈపీ–2020 5+3+3+4 పాఠశాల విధానాన్ని ప్రవేశపెట్టారు.ఈ విధానాన్ని 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.దీంతో నూతన విద్యా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్రం ఆదేశాల మేరకు శిక్షా సప్తాహ్ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు, స్థానికులు భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ప్రతి పాఠశాలలో విద్యావారం తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు చేపట్టాం. సంబంధిత ఫొటోలతో కూడిన డాక్యుమెంటేషన్ నమోదు చేయాలని సూచించాం. ఈ కార్యక్రమం నిర్వహణ, అమలు తీరు, విధి విధానాలను ఉప విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్స్, మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. -జి.పగడాలమ్మ, డీఈఓ, పార్వతీపురం మన్యం జిల్లా
DSC Coaching Applications : డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడగింపు..
జూలై 22–స్థానిక వనరులతో బోధన సామగ్రి ప్రదర్శన
ఉపాధ్యాయులు స్థానికంగా లభించే వనరులతో తయారు చేసిన బోధన, అభ్యసన సామగ్రి తయారు చేసి ప్రదర్శించాల్సి ఉంటుంది. దీనికి విద్యార్థుల తల్లిందడ్రులతో పాటు స్థానిక పెద్దలను ఆహ్వానించాలి
జూలై 23–పునాది అభ్యసన కార్యక్రమం
దీనిలో భాగంగా 1వ తరగతి నుంచి భాషపై పట్టు సాధించేందుకు పునాది అభ్యసనం, గణితంలోని సంఖ్యా శాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సమాజ భాగస్వాములకు చర్చ ద్వారా అవగాహన కల్పించాల్సి ఉంది.
Indian Languages: క్లాసిక్ భాషా హోదా పొందిన ఆరు భాషలు ఇవే..
జూలై 24–క్రీడా దినోత్సవం
వివిధ క్రీడాంశాలపై పోటీలు నిర్వహించడం, శారీరక సౌష్టవం ప్రాముఖ్యతను తెలియజేసేలా ఈ పోటీలు ఉండాలి.
జూలై25–సాంస్కృతిక దినోత్సవం
విద్యార్థుల్లో భిన్నత్వంలో ఏకత్వం భావాన్ని పెంపొందించడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు (ఫ్యాన్సీ)డ్రెస్, పాటలు, నృత్య ప్రదర్శన, నాటికలు నిర్వహించాలి.
జూలై 26–సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం
స్కిల్,డిజిటల్ ఇనిషియేటివ్ డే లో భాగంగా ప్రస్తుత ఉద్యోగావకాశాల నేపథ్యంలో అన్ని తరగతి గది అనుభవాలను మెరుగుపరచడానికి డిజిటల్ కార్యక్రమాలకు అవసరమయ్యే నూతన నైపుణ్యాల అవసరాన్ని గుర్తించడం. విద్యలో సాంకేతిక అభివృద్ధిని గుర్తించేలా చర్చించడం.
Erranna Vidya Sankalpam : ముగిసిన ఎర్రన్న విద్యా సంకల్పం పరీక్ష..
జూలై 27– పర్యావరణ పరిరక్షణ దినోత్సవం
పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర కృత్యాలు (మిషన్ లైఫ్ ఏక్టివిటీస్) పాఠశాలలో పోషణ దినోత్సవం నిర్వహణ (న్యూట్రిషన్ డే) పాఠశాలలో కొత్త ఎకో క్లబ్‌ల ఏర్పాటు, విద్యార్థులు, తల్లులు, మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకి అంకితం కార్యక్రమం. దీనిలో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 35 మొక్కలు తల్లీబిడ్డలతో కలిపి నాటించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి.
జూలై 28–సామాజిక భాగస్వామ్య దినోత్సవం
విద్యార్థుల భావోద్వేగ శ్రేయస్సు కోసం ప్రజలు, తల్లిదండ్రుల కమిటీలు, ఉపాధ్యాయ సంఘాల సహకారాన్ని పెంపొందించడం. నైపుణ్యాభివృద్ధికి పర్యావరణ వ్యవస్థను అందించడం.అంటే పుట్టిన రోజులు, ప్రత్యేక సందర్భాల్లో తిధి భోజనాలు, విద్యార్థులతో పెద్దలు, ఉపాధ్యాయులు సహపంక్తి భోజనం చేయడం.
వారం రోజుల కార్యక్రమాలు ఇలా..
శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా విద్యాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలతో వారం రోజుల పాటు నిర్వహించే ప్రణాళికను విద్యాశాఖ జిల్లాలోని పాఠశాలలకు పంపించింది.