NCC Training: ఎన్‌సీసీ శిక్షణతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్..!
చిత్తూరు: ఎన్‌సీసీ శిక్షణతో భవితకు భరోసా వస్తుందని అంధ్రా బెటాలియన్ క్యాంప్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ లోకనాథన్ తెలిపారు. శనివారం చిత్తూరులోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో వార్షిక శిక్షణ క్యాంపును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎన్‌సీసీలో శిక్షణ పొందే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పారు. శిక్షణలో నేర్చుకునే ప్రతి అంశమూ క్యాడెట్ల ఉన్నతికి దోహదపడుతుందన్నారు.
Counselling for Gurukul Inter Admissions: గురుకులంలో ఇంటర్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ!
ఎన్‌సీసీ ఏ,బీ,సీ సర్టిఫికెట్‌లతో ఉన్నత విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ సదుపాయం లభిస్తుందని వెల్లడించారు. ఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా తల్ సైనిక్, ఐజీసీ ఆర్‌డీసీ క్యాంప్‌ల కోసం క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. తుపాకీ, డ్రిల్, ఆబ్‌స్టెకిల్, మ్యాప్‌రీడింగ్, కమ్యూ నిటీ డెవలప్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు ప్రసాద్‌రెడ్డి, గిరిధర్ నాయక్, రమేష్, కార్తిక్, చంద్ర, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Arrangements for Exams: టెన్త్ సప్లిమెంటరీ, డీఈఈ సెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..