Arrangements for Exams: టెన్త్ సప్లిమెంటరీ, డీఈఈ సెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..
అనంతపురం: ‘‘త్వరలో జరగనున్న డీఈఈసెట్, ఎస్‌ఎస్‌ఈ అడ్వాన్స్ సప్లిమెంటర్, ఏపీఓఎస్‌ఎస్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేపట్టండి’’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాపీయింగ్ జరిగితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణపై శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్‌ఎస్), ఎస్‌ఎస్‌ఈ, ఇంటర్ పరీక్షలు జూన్ 1 నుంచి 8 వరకు జరగనున్నాయన్నారు.
Free Admissions: ప్రైవేటు విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు!
రెండు కేంద్రాల్లో జరగనున్న ఎస్‌ఎస్‌ఈ పరీక్షకు 427 మంది విద్యార్థులు, ఐదు కేంద్రాల్లో జరగనున్న ఇంటర్ పరీక్షకు 964 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 10 నుంచి 12 వరకు జరుగుతాయన్నారు. మూడు కేంద్రాల్లో జరగనున్న ప్రాక్టికల్స్‌కు 379 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని ఆయన ఆదేశించారు.
Computer and Tally Course: కంప్యూటర్ అండ్ ట్యాలీ కోర్సుల్లో శిక్షణ.. దరఖాస్తులు చేసుకోండి!
24 నుంచి ఎస్‌ఎస్‌ఈ సప్లిమెంటరీ..
ఎస్‌ఎస్‌ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు జరగనున్నాయన్నారు. జిలావ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 13,332 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.
24న డీఈఈ సెట్
డీఈఈసెట్–2024 ఈనెల 24 జరగనుందని కలెక్టర్ తెలిపారు. ఒక కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షకు 34 మంది విద్యార్థులు, నలుగురు దివ్యాంగ విద్యార్థులు హాజరవుతారన్నారు.
CII Annual Summit: సీఐఐ వార్షిక బిజినెస్ సమావేశం
టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..
జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు జిల్లా ఎడ్యుకేషన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందులో జిల్లా, రాష్టస్థాయి నిపుణులు ఉండాలన్నారు. 10వ తరగతి, ఇతర పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. చదువుతోనే మంచి భవిష్యత్తు సాధ్యమని, ఈ దిశగా ప్రేరణ కలిగించేలా విద్యార్థులకు విద్యను ఉపాధ్యాయులు బోధించాలన్నారు. రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీలు, సాంస్కృతిక, వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీల్లో జిల్లా విద్యార్థులు పాల్గొనేలా చూడాలని చెప్పారు.
Vladimir Putin in China: చైనాలో ప్రర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్..
పరీక్షల్లో ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థిని ఒక ఉపాధ్యాయునికి మ్యాపింగ్ చేయాలని చెప్పారు. 8వ తరగతి నుంచి విద్యార్థులకు నైపుణాభివృద్ధి శిక్షణ ప్రారంభించాలన్నారు. విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. ఇందు కోసం దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, డీఈఓ వరలక్ష్మి, ప్రభుత్వ ఎగ్జామ్స్ అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్, డీఎంహెచ్‌ఓ ఈ.భ్రమరాంబదేవి. ఇతర అధికారులు పాల్గొన్నారు.