10th Class Marks Memo: ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’ తండ్రి మార్కుల షీట్‌ను పోస్ట్ చేసిన కొడుకు
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎవరి రహస్యాలూ దాగడం లేదు. ఓ కుర్రాడు తన తండ్రికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కుర్రాడు తండ్రి భద్రంగా దాచుకున్న అతని 10వ తరగతి మార్కు షీట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇందులో అన్ని సబ్జెక్టుల్లో తండ్రి ఫెయిల్ అయ్యాడు. ఆ మార్క్ షీట్ ఫోటోకు క్యాప్షన్‌గా ‘తన తండ్రి మార్క్ షీట్ దొరికింది’ రాశాడు.
ఆ కుర్రాడు వీడియోలో ‘మా నాన్న నాతో తరచూ పాస్ కావాలని చెబుతుంటారని, అయితే ఇప్పుడు చూడండి మా నాన్న మార్క్స్‌షీట్.. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఈ వీడియోను చూసినవారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు.
ఈ మార్క్‌షీట్‌ను @desi_bhayo88 పేరిట సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ పోస్టును ఇప్పటివరకూ ఐదు లక్షల మంది చూడగా, ఐదు వేల మంది లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై పలువురు కామెంట్లు కూడా చేశారు. ఒక యూజర్ ఇప్పటితో పోల్చిచూస్తే సీబీఎస్‌ఈ బోర్డులో తండ్రి ఫెయిల్ అయిన మార్కులు 90 శాతానికి సమానం అని రాశారు. మరొకరు ఫెయిల్ అయితే ఏమవుతుందో తెలుసు కనుకనే పాస్ కావాలని చెప్పారని రాశారు.
Pitaji ki marksheet mil gayi 😂 pic.twitter.com/3dXn0yKJh1
— Desi Bhayo (@desi_bhayo88) April 19, 2024