CII Annual Summit: సీఐఐ వార్షిక బిజినెస్ సమావేశం
ఇందులో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ మేరకు పారిశ్రామిక దిగ్గజాలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూలైలో పూర్తి సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. దీనిని అత్యుత్తమంగా రూపొందించడానికి సీఐఐతో చర్చలు జరుపుతామని చెప్పారు. భారత్ వృద్ధి తీరు స్థిరంగా కొనసాగుతుందని, దీనికి సంబంధించి దేశం ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు.
భారత వినియోగ వస్తు - సేవల విపణి 2031వ ఏడాదికల్లా రెట్టింపు కావొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం కానుందన్నారు. సోలార్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా రంగాల పురోగతికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు యువతకు గణనీయమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తాయని అన్నారు.
World Migration Report 2024: భారత్‌కు డబ్బేడబ్బు.. ఈ స్థాయిని అందుకున్న మొదటి దేశంగా రికార్డు..