Defence Spending Budget: రష్యా రక్షణ బడ్జెట్ రూ.10 లక్షల కోట్లు!
Sakshi Education
ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్షణ వ్యయాన్ని రికార్డు స్థాయిలో పెంచారు.
2025 బడ్జెట్‌లో 32.5 శాతాన్ని జాతీయ రక్షణకు కేటాయించారు.
రక్షణ వ్యయంగా 13.5 ట్రిలియన్ రూబుల్స్ (రూ.పది లక్షల కోట్లు) కేటాయించినట్లు డిసెంబర్ 1వ తేదీ ప్రకటించారు. గత ఏడాది మొత్తం బడ్జెట్‌లో 28.3 శాతం రక్షణకు కేటాయించగా.. ఈ ఏడాది 32.5 శాతానికి చేరింది. రష్యా పార్లమెంటు ఉభయ సభలు, స్టేట్ డ్యూమా, ఫెడరేషన్ కౌన్సిల్ బడ్జెట్ ప్రణాళికలను ఆమోదించాయి.
COP29 Summit: వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు.. 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ఒప్పందం
Published date : 02 Dec 2024 03:20PM