Skip to main content

World Migration Report 2024: భారత్‌కు డ‌బ్బేడబ్బు.. ఈ స్థాయిని అందుకున్న మొదటి దేశంగా రికార్డు..

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తమ సంపాదనను పంపడంలో (రెమిటెన్స్‌) రికార్డు సృష్టించారు.
India Received over USD 111 Billion in Remittances in 2022

2022లో భారతదేశానికి రెమిటెన్స్‌లు 111.22 బిలియన్‌ డాలర్లు చేరుకున్నాయి. ఇది ఇంతవరకు ఏ దేశం కూడా అందుకోని అత్యధిక మొత్తం. 100 బిలియన్‌ డాలర్ల మైలురాయిని దాటడంలో కూడా భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది.

ఈ విషయాలను ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐఓఎం) విడుదల చేసిన వరల్డ్‌ మైగ్రేషన్‌ రిపోర్ట్‌ 2024 వెల్లడించింది.

➤ రెమిటెన్సులకు సంబంధించి భారత్‌ తరువాతి నాలుగు స్థానాల్లో మెక్సికో(61 బిలియన్‌ డాలర్లు), చైనా (51 బిలియన్‌ డాలర్లు), ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్‌ నిలిచాయి. 2021లో చైనా స్థానాన్ని 2022లో మెక్సికో అధిగమించింది.  

GST Hit Record: జీఎస్‌టీ రికార్డు వసూళ్లు.. ఇప్పటి వరకూ ఇదే టాప్‌..

➤ దక్షిణాసియా నుంచి చాలా పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నందున ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్‌కు సంబంధించి అతిపెద్ద మొత్తాలను పొందుతోంది. దక్షిణాసియాలో భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు రెమిటెన్సులకు సంబంధించి టాప్‌–10 దేశాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ 30 బిలియన్‌ డాలర్లతో ఆరవ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్‌ 21.5 బిలియన్‌ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో నిలుస్తోంది.  

➤ 44.8 లక్షల మంది వలసదారుల గమ్యస్థాన దేశంగా భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. 
➤ విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశంగా అమెరికా (8,33,000) ఉంది. తరువాతి స్థానాల్లో బ్రిటన్‌ (దాదాపు 6,01,000), ఆస్ట్రేలియా (దాదాపు 3,78,000), జర్మనీ (3,76,000 పైగా), కెనడా (దాదాపు 3,18,000) ఉన్నాయి.

Ecommerce Market: 325 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకోనున్న భారత ఈ-కామర్స్ మార్కెట్.. ఎప్ప‌టిలోపు అంటే..

భారత్‌ పయనమిలా..
(అంకెలు బిలియన్‌ డాలర్లలో) 
2010    53.48 
2015    68.91 
2020    83.15 
2022    111.22 

Published date : 09 May 2024 12:07PM

Photo Stories