GST Hit Record: జీఎస్‌టీ రికార్డు వసూళ్లు.. ఇప్పటి వరకూ ఇదే టాప్..
సమీక్షా నెలలో రూ.2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటి రికార్డు. అంటే సమీక్షా నెల్లో వార్షిక ప్రాతిపదికన 12.4 శాతం పురోగతి నమోదయ్యింది. ఆర్థిక క్రియాశీలత, దిగుమతుల పురోగతి వంటి అంశాలు జీఎస్‌టీ రికార్డుకు కారణమయ్యింది.
విభాగాల వారీగా ఇలా..
➤ మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ.2,10,267 కోట్లు.
➤ సెంట్రల్ జీఎస్‌టీ రూ.43,846 కోట్లు.
➤ స్టేట్ జీఎస్‌టీ రూ.53,538 కోట్లు.
➤ ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.99,623 కోట్లు
➤ సెస్ రూ.13,260 కోట్లు (దిగుమతులపై రూ.1,008 కోట్లుసహా)
ఏపీలో 12%, తెలంగాణలో 11% వృద్ధి..
కాగా.. జీఎస్‌టీ ఇంటర్ గవర్నమెంట్ సెటిల్మెంట్‌లో భాగంగా ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ నుంచి కేంద్ర జీఎస్‌టీకి రూ.50,307 కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీకి రూ.41,600 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. దీంతో మొత్తంగా కేంద్ర జీఎస్‌టీగా రూ.94,153 కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీగా రూ.95,138 కోట్ల ఆదాయం సమీక్షా నెల్లో సమకూరినట్లు అయ్యింది.
Upgradable ATMs: భారత్‌తో తొలిసారి కొత్త రకం ఏటీఎంలు.. సీఆర్‌ఎం మెషీన్లు అంటే ఏమిటీ?
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ నెలలో జీఎస్‌టీ వసూళ్లు వృద్ధిని కనబరిచాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్‌టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 12% వృద్ధితో రూ.4,850 కోట్లు, తెలంగాణలో 11% వృద్ధితో రూ.6,236 కోట్లు నమోదయ్యాయి. అయితే దేశంలోనే అత్యధిక జీఎస్‌టీ వసూళ్లు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వసూళ్లు 13 శాతం వృద్ధితో రూ.37,671 కోట్లకు ఎగశాయి.
గత ఆర్థిక సంవత్సరంలో నుంచి (అంకెలు రూ. లక్షల కోట్లలో)
2023 సంవత్సరం..
ఏప్రిల్ 1.87
మే 1.57
జూన్ 1.61
జూలై 1.60
ఆగస్టు 1.59
సెప్టెంబర్ 1.63
అక్టోబర్ 1.72
నవంబర్ 1.67
డిసెంబర్ 1.64
2024 సంవత్సరం..
జనవరి 1.74
ఫిబ్రవరి 1.68
మార్చి 1.78
ఏప్రిల్ 2.10
2017 జూలైలో తాజా పరోక్ష పన్ను వ్యవస్థ జీఎస్‌టీ ప్రారంభమైన తర్వాత 2024 ఏప్రిల్, 2023 ఏప్రిల్, 2024 మార్చి, 2024 జనవరి, 2023 అక్టోబర్ ఇప్పటి వరకూ టాప్–5 జీఎస్‌టీ నెలవారీ వసూళ్లను నమోదుచేశాయి.
New Currency: ఆర్థిక గందరగోళం తర్వాత కొత్త కరెన్సీ ప్రారంభం.. ఎక్కడంటే..