Skip to main content

Upgradable ATMs: భారత్‌తో తొలిసారి కొత్త రకం ఏటీఎంలు.. సీఆర్‌ఎం మెషీన్లు అంటే ఏమిటీ?

హిటాచీ పేమెంట్ సర్వీసెస్ భారత్‌ ఒక కొత్త అప్‌గ్రేడబుల్ ఏటీఎం మెషీన్‌ను ప్రారంభించింది.
Hitachi Payment Services Introduces Upgradable ATMs in India  First upgradable ATM in India by Hitachi Payment Services

ఈ ఏటీఎంలను ఎప్పుడైనా నగదు రీసైక్లింగ్ మెషిన్ (CRM)కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. దేశంలోనే మొదటి అప్‌గ్రేడబుల్ ఏటీఎం ఇదని హిటాచీ సంస్థ పేర్కొంది.

'మేక్ ఇన్ ఇండియా' చొరవ కింద తయారు చేసిన ఈ ఏటీఎంలు బ్యాంకులకు మెరుగైన సౌలభ్యాన్ని, సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో 2,64,000 ఏటీఎంలు/సీఆర్‌ఎంలు పనిచేస్తున్నాయి, వీటిలో 76,000కు పైగా హిటాచీ నిర్వహిస్తోంది. రాబోయే ఎనిమిదేళ్లలో దాదాపు 1,00,000 అప్‌గ్రేడబుల్ ఏటీఎంల మార్కెట్‌ ఉంటుందని కంపెనీ అంచనా వేసింది.

ఏంటీ సీఆర్‌ఎం మెషీన్లు?
➤ సీఆర్‌ఎం మెషీన్లు అంటే క్యాష్‌ రీసైక్లింగ్‌ మెషీన్‌. దీని ద్వారా నగదు డిపాజిట్‌, విత్‌డ్రా రెండు సేవలనూ పొందవచ్చు.
➤ ప్రస్తుతం బ్యాంకులు ఈ నగదు రీసైక్లింగ్ మెషీన్‌ల ద్వారా తమ శాఖల వద్ద రౌండ్-ది-క్లాక్ నగదు ఉపసంహరణ, డిపాజిట్ సేవలను అందిస్తున్నాయి.

RBI: ఐదు బ్యాంకులకు రూ.60.3 లక్షల జరిమానా విధించిందిన ఆర్బీఐ!!

➤ అయితే ఆఫ్‌సైట్ ప్రదేశాల్లో బ్యాంకులు సాధారణంగా ఏటీఎంల ద్వారా 24 గంటలూ నగదు ఉపసంహరణ సేవలను మాత్రమే అందిస్తాయి.
➤ ఈ అప్‌గ్రేడబుల్ ఏటీఎంలను ఇలాంటి చోట్ల ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులు తమ వారి వ్యాపార అవసరాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డిపాజిట్‌, విత్‌ డ్రా సేవలు విస్తరించడానికి వీలు కలుగుతుంది.

Published date : 29 Apr 2024 05:36PM

Photo Stories