Skip to main content

CA Ranker Inspiring Story : ప‌దేళ్ల కృషితో సీఏగా గెలుపు.. ఆనందంతో తండ్రీ కూతుళ్లు..

ఒక ప‌ని చేయాల‌నున్నా, ఎదైనా చ‌దివి సాధించాల‌న్న ఉండాల్సింది న‌మ్మ‌కం, ప‌ట్టుద‌ల, కృషి. ఇవి ఉంటే ఎంత‌టి క‌ష్టాన్నైనా దాటుకొని గెల‌వ‌గ‌లం అని ఢిల్లీకి చెందిన యువతి అమితా ప్రజాప‌తి నిరూపించారు.
Chai seller daughter from Delhi achieves her Chartered Accountant goal with her ten years struggle

అందరూ క‌ల‌లు కంటారు కాని, అందుకు త‌గిన కృషి చేస్తేనే, ఎంద‌రు ఎన్ని మాట‌ల‌న్నా ఓర్పుతో ఉంటేనే అనుకున్న ల‌క్ష్యాన్ని చేరగ‌లుగుతారు.

ఇలాగే, త‌న ప‌దేళ్ల క‌ష్టానికి ఫ‌లితాన్ని అందుకుంది అమితా ప్ర‌జాప‌తి. త‌న గెలుపుని త‌న తండ్రితో పంచుకునేందుకు అస్స‌లు ఆగ‌లేక బ‌య‌ట‌నుంచి వ‌చ్చిన త‌న తండ్రి బండి దిగ‌క‌ముందే వెళ్ళి గ‌ట్టిగా హ‌త్తుకుంది. త‌న‌లో ఉన్న బాధ, సంతోషం, వంటి అన్నింటినీ ఒక్క ఆనంద భాష్పాల‌తో క‌రిగించింది. త‌న గెలుపును తెలుసుకున్న త‌న తండ్రి కూడా సంతోషంతో ఉప్పొంగిపోయారు.

Student Achieves IIT Madras Seat : మ‌ద్రాస్ ఐఐటీలో సీటు సాధించిన ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థిని..

ఫ‌లించిన ప‌దేళ్ల కృషి..

అస‌లు విష‌యం ఏంటంటే.. అమితా ప్ర‌జాప‌తి గ‌త ప‌దేళ్ల నుంచి క‌ష్ట‌ప‌డి చ‌దివిన సీఏ కోర్సులో పైచేయి సాధించి, చివ‌రికి 'నాన్నా.. నేను ఛార్ట‌ర్డ్ అకౌంటెంట్‌ను అయ్యాను' అని గ‌ర్వంగా చెప్పుకోచ్చింది. ఇలా, త‌న‌లోని భావాల‌ను, బాధ, సంతోషాన్ని త‌న లింక‌డిన్ అకౌంట్‌లో రాసుకోచ్చింది. అలాగే, త‌న తండ్రిని ఆనందంతో హ‌త్తుకున్న వీడియోను షోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.

Job with 34.40 Lakhs Package : త‌ల్లిదండ్రుల క‌ష్టాని ఫలితంగా యువ‌తి గెలుపు.. ఏకంగా 34.40 ల‌క్ష‌ల ప్యాకేజీతో ఉద్యోగం..!

గ‌త ప‌దేళ్లుగా సీఏ అవ్వాల‌ని క‌ష్ట‌ప‌డి, బంధువులు, ఇరుగుపొరుగు వారంతా ఏమన్నా కూడా లెక్క చేయ‌కుండా అన్ని బాధ‌ల‌ను దిగ‌మింగుకొని, త‌న తండ్రి చాయి అమ్మితే వ‌చ్చిన డ‌బ్బుతోనే ఇంటికి న‌డుపుతూ, త‌మ పిల్ల‌ల చ‌దువుకు ఫీజులు జెమ‌చేస్తూ వ‌చ్చారు. ఒక సాధార‌ణ ఆడ‌పిల్ల‌, బిలో యావ‌రేజ్ స్టూడెంట్ అస‌లు ఇంత పెద్ద కోర్సు త‌నెలా పూర్తి చేస్తుందంటూ కొంద‌రు, చాయి అమ్మితే వ‌చ్చే డ‌బ్బుల‌తో ఎలా సీఏ చ‌దివిస్తారు అని కొందరు అన‌డం. ఎలా ఎందరు ఎన్ని మాట‌లు అన్న కూడా ఏమాత్రం ప‌ట్టించుకోకుండా త‌మ పిల్లల్ని చ‌దివించాల‌న్న త‌ప‌న మాత్ర‌మే ఉండేది అమితా ప్ర‌జాప‌తి తండ్రికి. చివ‌రికి త‌న తల్లిదండ్రుల క‌ష్టం, అమితా ప్ర‌జాప‌తి శ్ర‌మ ఊరికే పోలేదు. అన్నింటినీ దాటుకొని విజ‌య ఢంకా మోగించింది.

క‌ల‌లు నిజ‌మ‌వుతాయి..

మ‌నం క‌నే క‌ల‌లు ఆల‌స్య‌మైనా కూడా ఎన్న‌టికైనా నిజ‌మ‌వుతాయి. స‌మ‌యం చాలానే ప‌ట్టొచ్చు, ఎన్నో అడ్డంకులు రావొచ్చు, మ‌న చుట్టూ ఉన్న జ‌నాలు ఎన్ని విధాలుగానైనా మాట్లాడుకోవ‌చ్చు. కాని, మ‌నం ఎప్ప‌టికీ మ‌న‌లో ఉన్న ధైర్యాన్ని కోల్పోకూడ‌దు. మ‌న‌లో న‌మ్మ‌కం, ధైర్యం, ప‌ట్టుద‌ల‌, కృషి ఉన్నంత వ‌ర‌కు ఎంత‌టి విజ‌యాన్నైనా చేర‌గ‌లం. 

CA Ranker Success Story : సీఏలో తొలి ప్ర‌య‌త్నంలోనే రెండో ర్యాంకు.. ప్రిప‌రేష‌న్‌లో ఇవి త‌ప్ప‌నిస‌రి..!

Published date : 22 Jul 2024 12:51PM

Photo Stories