CA Ranker Success Story : సీఏలో తొలి ప్రయత్నంలోనే రెండో ర్యాంకు.. ప్రిపరేషన్‌లో ఇవి తప్పనిసరి..!
ఇటీవలె, మే నెలలో నిర్వహించిన సీఏ పరీక్షలో పాసై ఏకంగా రెండో ర్యాంకుతో విజయం సాధించి, తన ఆశయాన్ని నెరవేర్చుకున్న ఈ యువతి వర్షా అరోరా.. తను చిన్నతనం నుంచి చదువులో ఎంత చురుగ్గా ఉన్నప్పటికి, అత్యంత కఠినమైన పరీక్ష సీఏ లో తొలి ప్రయత్నంలోనే విజయం దక్కించుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి. అయితే, ఇంతటి విజయం సాధించడం ఎంతో కృషి, పట్టుదల, శ్రమ వంటివి ఉంటేనే ఒక వ్యక్తి దేనినైనా గెలవగలరు. ఇప్పుడు మనం వర్షా అరోరా విజయ రహస్యం గురించి తెలుసుకుందాం..
వర్షా అరోరా.. ఢిల్లీకి చెందిన యువతి. తన చిన్న వయసు నుంచే చదువులో ఎప్పుడూ ముందుండేది. తనకు లక్ష్యంగా యూపీఎస్సీలో నెగ్గి ప్రజలకు సేవ చేయాలని ఉండేది. అందుకు ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉండేది. కాని, అప్పటికే తన స్నేహితులు సీఏ చేస్తుండగా, వారు చెప్పే మాటలు, దానితోపాటు తనకి తానుగా తెలుసుకున్న ఆసక్తి కరమైన విషయాలను అనుసరిస్తూ, తన తండ్రి ఆర్థిక నేపథ్యం కూడా ఒక కారణం అంటూ తన సీఏ ప్రయాణ ప్రారంభం గురించి వివరించారు.
చదువు..
ఢిల్లీలోని అర్వాచిన్ భారతీ భవన్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో వర్షా తన ఇంటర్ వరకు చదువును పూర్తి చేసుకుంది. ఇక్కడ తను 95 శాతం దక్కించుకుంది. ఢిల్లీలోనే ఉంటూ ఇంద్రప్రస్త మహిళా కళాశాలలో బీకాం ఆనర్స్‌ను పూర్తి చేసింది.
సీఏ వ్యూహం ఇలా..
ఎటుంటి పరీక్షలో నెగ్గాలన్నా అందుకు తగ్గ ప్రిపరేషన్ తప్పనిసరి. దీనికి చాలామంది కోచింగ్ క్లాసెస్‌కు వెళ్తుంటారు. ఎన్న డబ్బులైనా పర్లేదంటూ ఉన్నత క్లాసులనే ప్రిఫర్ చేస్తారు. కాని, వర్షా మత్రాం ఫౌండేషన్ పరీక్షకు తాను ఎటువంటి కోచింగ్ తీసుకోలేదని చెప్పకొచ్చారు. తనకు తన ఇంటర్‌లో నేర్పిన అంశాలే సీఏలో నెగ్గేందుకు సహాయపడ్డాయని వివరించారు. ఇదిలా ఉంటే.. ఇంటర్, సీఏ ఫైనల్ పరీక్షకు మాత్రం క్లాసుల్లో పాల్గొనగా ప్రారంభం కావడం ఆఫ్‌లైన విధానమైనా, కోవిడ్ కారణంగా ఆన్‌లైన్‌కు మారాల్సి వచ్చింది. అయినా, ఎప్పటికప్పుడు తన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రిపేర్ అయ్యేవారు. సీఏలో మొత్తం ఎనిమిది సబ్జెక్టులు ఉండగా అంఉదలో ఆరు సబ్జెక్టులకు మాత్రమే తాను కోచింగ్‌కు వెళ్ళినట్లు తెలిపారు. అందులోనూ కోచింగ్ కేవలం మూడు గంటలు ఉంటుందన్నారు.
కోచింగ్‌లో ఇలా ఉంటే.. తన సొంతంగా సుమారు 8 నుంచి 10 గంటల వరకు తాను స్వయంగా చదివేందుకు సమయాన్ని కేటాయిస్తానని తెలిపారు. అయితే, ఫైనల్ ఎగ్జామ్‌కు కొంత సమయమే మిగినప్పుడు మాత్రం తన సమయ కేటాయింపును ఇంకొచ్చం పెంచి పూర్తిగా 12 నుంచి 14 గంటలు చదివేవారు వర్షా.
Keir Starmer: నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రధాని అయిన స్టార్మర్.. ఆయన జీవిత చరిత్ర ఇదే..!
ఇలా ప్రోత్సాహం పొందాను..
డిగ్రీ ముగిసిన వెంటనే యూపీఎస్సీకి సిద్ధమై ప్రజలకు సేవ చేయాలనుకుంది. కాని, ఆ సమయంలోనే తన స్నేహితులు సీఏ ఎంచుకున్నారని తెలిసింది. అంతే కాకుండా, అందులో ఉండే లాభాలు, ఉద్యోగావకాశాలు, సీఏ కోర్సు అందిచే కెరీర్ అవకాశాల గురించి తెలుసుకున్న వర్షా తన లక్ష్యాన్ని యూపీఎస్సీ నుంచి సీఏ వైపుకు మళ్ళింది. అంతే కాదు, తన తండ్రి వృత్తి ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంట్స్ మేనేజర్ కావడం కూడా పెద్ద కారణమే.. ఇందులో తనకు తన స్నేహితులు, తన తండ్రి ఇద్దరి ప్రోత్సాహం ఉండడంతో ధైర్యంగా ముందుకు సాగింది.
సీఏలో మహిళలు..
ప్రస్తుతం, సీఏలో పురుషులకు సమానంగా మహిళలు మోగ్గు చూపుతున్నారు. ఈ రంగంలో మహిళల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉందంటూ వర్షా వివరించారు. అంతేకాకుండా, చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తిలో ఉన్న ప్రతీ అవకాశాలను అన్వేషించాలని చూస్తున్నానని తాను చేస్తున్న ఆర్టికల్‌షిప్ పూర్తి అవ్వగానే ఇందులో చేరతాను అని వివరించారు.
Inspirational Success Story : ఒకే వ్యక్తి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాడిలా.. కానీ..
ఇవి తప్పనిసరి..
ఇటువంటి పరీక్షలకు సిద్ధమైయ్యే సమయంలో చాలామంది విద్యార్థులు కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటారు. కాని, నేను చేసింది మాత్రం.. చదివే సమయంలోనే మధ్యలో కాస్త విరామం తీసుకొని 30 నుంచి 40 నిమిషాల వరకు వాకింగ్‌కి వెళ్ళేదాన్ని.. అంతేకాకుండా, సరైన ఆహారం సమయానికి తినాలని నిర్ణయించుకున్నాను అని వివరించారు. ఇదిలా ఉంటే ప్రోత్సాహించే విషయంలో తన తల్లిదండ్రులు ఎప్పుడూ ముందుండేవారని, తనకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎటువంటి బాధలు ఉన్న తల్లదండ్రులతో పంచుకునే స్వేచ్ఛ తనకు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇలాగే, ప్రతీ తల్లిదండ్రులు వారి పిల్లల వెంటే ఉండాలని కోరారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈ సమయంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు వర్షా.
Tags
- Success Story
- inspiring stories
- CA Rankers
- Chartered Accountant
- Chartered Accountant ranker Varsha Arora
- inspirational journey of ca rankers
- motivational stories in telugu
- CA ranker success story
- CA Ranker Varsha Arora
- Inspiring Stories of CA Rankers
- Chartered Accountant Rankers Success Stories
- CA Rankers stories in telugu
- latest stories of ca rankers
- inspiring stories of ca rankers
- difficulties in ca exam
- Chartered Accountancy Exam
- second ranker of ca 2024
- CA second ranker success story
- Education News
- Sakshi Education News