Sri Pujitha Secure 6 Government Jobs : ఒకేసారి 6 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అంధురాలు.. ఈమె సక్సెస్ జర్నీకి..
తనకున్న వైకల్యంతో ఏనాడు నిరుత్సాహపడకుండా.. మనోధైర్యంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. అందరిని ఔరా అనేలా చేసింది ఈ యువతి. ఈ నేపథ్యంలో శ్రీపూజిత సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
తెలంగాణలోని నల్లగొండకు చెందిన వారా శ్రీపూజిత. వీరి తండ్రి రాజశేఖర్. ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ స్వర్ణలత. ఈమె కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరికి అంధురాలైన కూతురు జన్మించింది. అయితే వీరు కుంగిపోకుండా కూతురు శ్రీపూజితను అంధురాలిగా కాకుండా సాధారణ యువతులా పెంచారు.
ఎడ్యుకేషన్ :
శ్రీపూజిత.. పదోతరగతి వరకు నల్గొండ అంధుల పాఠశాలలో చదివింది. ఇంటర్ సాయి అంధుల జూనియర్ కళాశాల (హైదరాబాద్)లో పూర్తి చేసింది. అలాగే డిగ్రీ బీఏ కోర్సు నల్గొండ ఎన్జీ కళాశాలలో, పీజీ హిస్టరీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, బీఈడీ నల్గొండ గోకుల్ కళాశాలలో చదివింది. జాతీయస్థాయిలో నిర్వహించే నెట్‌కు సైతం అర్హత సాధించింది. తాను అంధురాలని నిరుత్సాహపడకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉన్నత విద్య పూర్తిచేసింది.
తొలి ప్రయత్నంలోనే..
2022లో తొలి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఆ ఉద్యోగం చేస్తూనే.. తెలంగాణ గురుకుల లెక్చరర్ కొలువుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెల్లడైన గురుకుల ఫలితాల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించింది. పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) తెలుగు, సోషల్, టీజీటీ (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) తెలుగు, సాంఘికశాస్త్రం, జూనియర్ లెక్చరర్ తెలుగు, డిగ్రీ లెక్చరర్ తెలుగు ఉద్యోగాలను సాధించింది. వీటితోపాటు టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైంది. ఇందులో సైతం ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శ్రీ పూజితను పలువురు ప్రశంసిస్తున్నారు.
నా పరిస్థితికి ఏ రోజూ బాధపడలేదు..
తాను అంధురాలునని ఏ రోజూ బాధపడలేదు. మా తల్లిదండ్రులు నిత్యం ఎంతో ఆత్మస్త్యైర్యం ఇచ్చారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు బ్రెయిలీ లిపిలో చదివిన నేను ఏ రోజూ చదువుపరంగా ఇబ్బంది పడలేదని శ్రీ పూజిత చెబుతోంది. ప్రతి అంశాన్ని మా పేరెంట్స్ చదివి వినిపించేవారని, అలా అన్ని అంశాలను అర్థం చేసుకుని పరీక్షల్లో ఒకరి సహాయంతో పరీక్షను బాగా రాసి ఉత్తీర్ణత సాధించేదానినని చెబుతోంది.
ఈ ఆరు ఉద్యోగాల్లో నా ఎంపిక దీనికే..
పోటీపరీక్షల ప్రిపరేషన్‌కు అధ్యాపకులు, తల్లిదండ్రులు సహకారం, యూట్యూబ్‌లో పాఠ్యాంశాలను వింటూ ప్రిపేర్ అయ్యానని శ్రీ పూజిత తెలిపింది. కృషి, పట్టుదలతో అంధులు కూడా ఏదైనా సాధించవచ్చని నారు. టీచింగ్ ఫీల్డ్ పై తనకు మక్కువ ఉందని, ఆరు ఉద్యోగాల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటానని శ్రీ పూజిత చెబుతోంది.
Tags
- Sri pujitha secure 6 government jobs
- sri pujitha selected 6 government jobs at once
- sri pujitha selected 6 government jobs at once story
- sri pujitha selected 6 government jobs at once real stroy
- sri pujitha selected 6 government jobs story in telugu
- sri pujitha secure 6 government jobs story
- Sri Pujitha Secure 6 Government Jobs
- Telangana Goverment Jobs 2024
- Telangana Goverment Jobs 2024 News in Telugu
- government jobs story in telugu
- competitive exam success mantra
- competitive exam success stroy in telugu
- competitive exam success tips in telugu
- blind woman from nalgonda selected for six government jobs
- Blind Young Woman From Nalgonda Selected For 6 Govt Jobs At A Time
- Blind Young Woman From Nalgonda Selected For 6 Govt Jobs At A Time News in Telugu
- Blind Young Woman Selected For 6 Govt Jobs At A Time
- Blind Young Woman Selected For 6 Govt Jobs At A Time News in Telugu
- Blind Woman Sri Pujitha Selected for Six Government Jobs Story in Telugu
- Blind Woman Sri Pujitha Selected for Six Government Jobs Story