Skip to main content

Contract Jobs Notification 2024 : కాంట్రాక్టు పద్ధతిలో 872 పోస్టుల భర్తీ.. ఖాళీల వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే 8 మెడికల్ కాలేజీలు.., వాటి అనుబంధ జనరల్ ఆస్పత్రుల్లో 872 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Contract Jobs Notification 2024

ఈ 872 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలో భర్తీ చేయబోయే ఈ పోస్టులను 2025 మార్చి 31వ తేదీ వరకు కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటారు.గద్వాల, నారాయణపేట, ములుగు, నర్సంపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీల్లోని పోస్టులను భర్తీ చేస్తారు. కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు రావాలంటే తక్షణమే పోస్టుల భర్తీ అవసరం. అందుకే కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీ కొరకు అనుమతి జారీ చేశారు.

➤ Post Office Jobs: రాతపరీక్ష లేకుండానే పోస్టాఫీస్‌లో 44వేలకు పైగా ఉద్యోగాలు.. జీతం నెలకు రూ. 30వేల వరకు

ఖాళీల వివరాలు ఇవే..
ఒక్కో కాలేజీలో ప్రొఫెసర్ పోస్టులు 25, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 28, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 56 చొప్పున మొత్తం 109 పోస్టులు భర్తీ చేస్తారు.

వేతనం ఇలా..
ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ల వేతనం రూ.లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనం రూ.1.25 లక్షలు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Published date : 17 Jul 2024 07:41PM

Photo Stories