Unemployment JAC: డిమాండ్లు పరిష్కరించే వరకూ ఢిల్లీ వదలం
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: నిరు ద్యోగులకు రేవంత్ సర్కార్ ఎన్నికల సమ యంలో ఇచ్చిన వాగ్దా నాలను, నిరుద్యోగుల డిమాండ్లను పరి ష్కరించే వరకూ తాము ఢిల్లీ వదిలి వెళ్లేది లేదని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ తెలిపారు.
హైద రాబాద్ వేదికగా ఎన్ని ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లనే ఢిల్లీకి రావాల్సి వచ్చిందని చెప్పారు. నిరుద్యోగుల సమ స్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 16న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకులు దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు.
నిరుద్యోగుల సమ స్యలు పరిష్కరించకపోగా వారిపై లాఠీచార్జీలు చేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
Published date : 17 Jul 2024 03:57PM