Seven Police Sisters Inspirational Story : ఎన్నో అవహేళనలు, అవమానాలు ఎదుర్కొని.. ఈ ఏడుగురు ఆడపిల్లలు.. పోలీసు ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ..
వారిని చూసి గ్రామస్తులు నవ్వుకునేవారు. ఏడుగురు ఆడ పిల్లల పెళ్లిళ్లు ఎలా చేస్తారంటూ అవహేళనలు, అవమానాలు ఎదుర్కొంది ఆ జంట. ఇరుగుపొరుగువారు మానసిక వేదనకు గురి చేయటంతో ఒకానొక సమయంలో వారు సొంత గ్రామాన్ని విడిచి పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చప్రాలోని ఎక్మాకు వచ్చి స్థిరపడ్డాడు.
☛ Success Stories : ఎన్ని కష్టాలు ఉన్నా.. ఎస్ ఉద్యోగం కొట్టామిలా.. మా సక్సెస్‌కు కారణం ఇదే..
ఓ చిన్న పిండి గిర్నీని నడుపుతూ..
సరాన్ జిల్లా మాంఝీ పోలీస్ స్టేషన్ పరిధిలో నచాప్ గ్రామానికి చెందిన కమల్ సింగ్, శారదా దేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు , ఒక కుమారుడు. వ్యవసాయం చేసుకుంటూనే తన కుమార్తెల సహాయంతో ఇంటి దగ్గర ఓ చిన్న పిండి గిర్నీని నడిపేవాడు తండ్రి కమల్ సింగ్ . వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఏడుగురు ఆడపిల్లలను చదివించారు. ఈ 7 గురు ఆడపిల్లలు ఏమనుకున్నారో .. ఏమో తెలియదు కాని.. జనాల నోటికి తాళం వేయించారు. అందరూ ఆశ్చర్యపోయేలా.. ఏకంగా ఏడుగురు ఆడపిల్లలు పోలీస్ డిపార్ట్ మెంట్లో ఉద్యోగం కొట్టేశారు. బీహార్ రాష్ట్రంలో ఒకే కుటుంబంలోని ఏడుగురు అక్కాచెల్లెళ్లు అద్భుతం సృష్టించారు. బీహార్ రాష్ట్రం అంతా వీరి పేరు మారుమోగుతుంది.
పోలీసు శాఖతో పాటు దేశంలోని వివిధ భద్రతా విధుల్లో ఉద్యోగం సాధించారు. దీంతో సెవెన్ సిస్టర్స్ పేర్లతో పాటు వారిని సరైన మార్గంలో నడిపించిన ఆ తల్లి దండ్రుల పేర్లు కూడా మార్మోగిపోతున్నాయి. ఈ ఏడుగురు అక్కాచెల్లెళ్లు బీహార్ పోలీసు శాఖతో పాటు వివిధ కేంద్ర సాయుధ బలగాలకు పోలీసులుగా ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు.
ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఉద్యోగాలు కొట్టారిలా..
వీరిలో మొదటి కుమార్తె 2006లోనే కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. దీంతో మిగతా వారందరూ పోలీసు శాఖలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక వీరిలో రెండో సోదరి రాణి పెళ్లి తర్వాత 2009లో బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా జాయిన్ అయ్యారు. అలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా మరో ఐదుగురు కూడా ఎక్సైజ్ శాఖ, సీఆర్పీఎఫ్, జీఆర్‌పీ సహా వివిధ కేంద్ర బలగాల్లో ఎంపికయ్యారు. ఉద్యోగానికి ఎంపిక అయ్యేందుకు ముందు కావాల్సిన నైపుణ్యాలు, మెలకువలను వీరందరూ తమ అక్కల ద్వారా నేర్చుకున్నారు. ఒకరికొకరు మార్గదర్శకులుగా మారారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు. నేటి మహిళకు.. అలాగే ఎన్నో కుటుంబాలకు వీరి సక్సెస్ జర్నీ ఒక స్ఫూర్తిధాయకం.
☛ AP SI Job Selected Candidates: ఖాకీ స్టార్స్.. ఎస్ఐలుగా ఎంపికైన కానిస్టేబుళ్లు.. వీరే..!
చిన్న వాడైన తమ్ముడి కోసం.. ఏకంగా..
ఇప్పుడు తమ బిడ్డలను చూసి కమల్ సింగ్ దంపతులు గర్వపడుతున్నారు. తాను ఆడబిడ్డలు భారమని ఏనాడు భావించలేదని అన్నారు. వారిని పెంచి పెద్దచేస్తే వాళ్ల బతుకు వాళ్లే బతుకుతారు అనే ధైర్యంతోనే ఉండేవాడినని చెప్పారు. కానీ ఇప్పుడు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి నేను అనుకున్నదాని కంటే గొప్పగా బతుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్య విషయం ఏంటంటే.. తల్లిదండ్రులు, చిన్న వాడైన తమ్ముడి మీద ప్రేమతో ఆ ఏడుగురు అక్కాచెల్లెళ్లు నాలుగంతస్తుల భవనం కట్టించారు.
Tags
- seven sister got police jobs
- Seven Bihar Sisters Don Uniform Making
- Seven Bihar Sisters Don Uniform Jobs News in Telugu
- seven bihar sister's police news telugu
- seven uniformed sisters of Ekma in Chhapra district
- All Seven Sisters Don Police Jobs
- All Seven Sisters Don Police Jobs News in Telugu
- Seven Sister Police Jobs News in Telugu
- Seven Bihar Sister's Police Jobs 2024
- Seven Bihar Sister's Police Jobs 2024 News in Telugu
- Seven Bihar Sister's Police Jobs Success Story
- Seven Bihar Sister's Police Jobs Real Story in Telugu
- Seven Bihar Sister's Police Jobs Family Details in Telugu
- sakshieducation success stories
- women empowerment stories