Gurukul Staff Transfer Counselling : బదిలీల కౌన్సెలింగ్ వాయిదాలపై గురుకుల సిబ్బంది తీవ్ర ఆగ్రహం..!
గురుకుల సిబ్బంది బదిలీలకు షెడ్యూల్‌ను ప్రకటించిన అధికారులు, తీరా సిబ్బందులు వచ్చాక కౌన్సెలింగ్‌ను వాయిదా వేశామని చెప్పారు. దీంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ పరిధిలోని ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్లు ఏకాదశి పండుగపూట హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బంజారాభవన్ ఎదుట పడిగాపులు పడాల్సి వచ్చింది. ఈ కారణంగా, సొసైటీ ఉన్నతాధికారుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం 317 జీవో డిస్‌లొకేట్ అభ్యర్థులకు 10న బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తే.. ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, వ్యాయామ టీచర్లకు మధ్యాహ్నం 12 గంటలకు సమయం కేటాయించారు. కాని, వారంతా ఉదయం నుంచి పడిగాపులు గాచినా.. ఆ రోజు రాత్రి 7.30 గంటలు దాటినా కూడా కౌన్సెలింగ్ నిర్వహించలేదు.
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు.. ఇక్కడ స్కూల్స్‌కు సెలవు
మళ్లీ వాయిదా..
వారంతా ఉదయం నుంచి కౌన్సెలింగ్ కోసం వేచి చూస్తున్నప్పటికీ చివరికి 13న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పి పంపారు. ఆ రోజున సిబ్బంది మొత్తం వచ్చినా కౌన్సెలింగ్‌ను మళ్లీ వాయిదా వేస్తున్నట్టు సొసైటీ ఉన్నతాధికారులు వెల్లడించారు. 13వ తేదీ కాస్త 17న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మరోసారి షెడ్యూల్ ప్రకటించినా.. బుధవారం.. అంటే 17వ తేదీన ఉదయం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్లు బంజారభవన్‌కు చేరుకున్నారు.
కాని, వారంతా ఆరోజు మధ్యహ్నం 1 గంటల వరకు వేచి చూసినా సొసైటీ ఉన్నతాధికారులెవరూ రాకపోవడంతో అందరూ అక్కడి నుంచి మాసబ్ ట్యాంక్‌లోని గురుకుల సొసైటీ కార్యాలయానికి వెళ్లారు. అయితే, అక్కడి నుంచి ఉన్నతాధికారులను సంప్రదించేవరకు కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్టు తెలుపలేదని ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్లు వాపోయారు.
Tags
- gurukul staff
- transfer counselling
- superiors
- teachers anger
- gurukul teachers transfer
- ekadashi festival
- social welfare gurukul
- Teaching staff
- gurukul staff transfer counselling
- postponement of gurukul staff counselling
- transfer counselling for gurukul teachers
- Gurukul teachers
- teachers anger on superiors
- Education News
- Sakshi Education News
- Societal problem-solving
- Teacher participation
- Community engagement
- SocialIssues
- SakshiEducationUpdates