Skip to main content

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వ‌ర్షాలు.. ప్రమాద హెచ్చరికలు జారీ.. ఇక్క‌డ‌ స్కూల్స్‌కు సెలవు

తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి.
Heavy Rains in Andhra Pradesh, School Holidays Hear  Heavy Rainfall in Telugu States  Education department announces holiday for schools in Union Visakha district due to heavy rains

ఈ నేపథ్యంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో, ధవళేశ్వేరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద గోదావరి నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇక, వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఐదు ఎస్డీఆర్‌ఎఫ్‌, నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు విధుల్లో ఉన్నాయి.

కాగా, ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46.7 అడుగులకు చేరుకుంది. మరోవైపు, పోలవరం వద్ద గోదావరి నీటి ప్రవాహం 12.5 మీటర్లకు చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. గోదావరి నుంచి ప్రస్తుతం 10 లక్షల 28 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల అవుతోంది. 

మరికాసేపట్లో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్న అధికారులు. ప్రస్తుతం 47.5 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి ఉధృతి నేపథ్యంలో ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు.. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.

July 22, 23rd Schools Holidays Due to Heavy Rain 2024 : అలర్ట్‌.. భారీ వర్షాలు.. రేపు, ఎల్లుండి స్కూల్స్‌కు సెల‌వులు.. ఇంకా..!

ఇక, ఏజెన్సీలోని పలు గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. ఇప్పటికే చర్ల మండలంలోని మూడు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ ఆదేశించారు.

మరో మూడు రోజలు పాటు.. 
ఇక, గోదావరి ఉధృత ప్రవాహం నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మరికాసేపట్లో ఛద్రాచలం చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సహయక చర్యలు ఏవిధంగా జరుగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రా‍ల్లో మరో మూడు రోజలు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అక్కడ స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 27-07-2024 : (శనివారం) బోనాలు
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛ 07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

Published date : 22 Jul 2024 12:41PM

Photo Stories