Computer and Tally Course: కంప్యూటర్ అండ్ ట్యాలీ కోర్సుల్లో శిక్షణ.. దరఖాస్తులు చేసుకోండి!
ఒంగోలు: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో కంప్యూటర్ అండ్ ట్యాలీ కోర్సులో శిక్షణ, ఉద్యోగం కల్పిస్తారని ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ హరిప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత, ఇంటర్ పాస్/ ఫెయిల్, డిప్లొమా పాస్/ఫెయిల్, డిగ్రీ పాస్ / ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని, 35 రోజులపాటు జరిగే ఈ శిక్షణ కాలంలో భోజనం, ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారని చెప్పారు.
Awareness Classes for Teachers : నేడు ఈ సబ్జెక్టు టీచర్లకు అవగాహన తరగతులు..
35 రోజుల కోర్సులో ట్యాలీ జీఎస్‌టీ, కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్‌ప్లేస్ ఎథిక్స్ లో అత్యుత్తమ శిక్షణ ఉచితంగా ఇస్తారన్నారు. శిక్షణ తదనంతరం వంద శాతం వివిధ సంస్థల్లో కనీస నెల జీతం రూ.15 వేలు పైన కల్పిస్తారన్నారు. పూర్తి వివరాలకు హరిప్రసాద్ 9000487423 ను సంప్రదించాలన్నారు.
AP SSC Supplementary Exams: ఈనెల 24 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
Tags
- Unnati Foundation
- Free training
- computer and tally
- Courses
- Applications
- banglore
- Job Opportunity
- Foundation Co Ordinator Hariprasad
- Tenth Students
- graduated
- non graduated
- job offer with course
- Education News
- Sakshi Education News
- Ongole News
- EducationOpportunity
- SkillDevelopment
- ComputerCourse
- 10thClass