Skip to main content

Awareness Classes for Teachers : నేడు ఈ స‌బ్జెక్టు టీచ‌ర్ల‌కు అవ‌గాహ‌న త‌ర‌గ‌తులు..

33 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్లకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈవో డి.సుభద్ర ప్ర‌క‌టించారు..
Awareness Classes for English and Maths subject teachers

ఒంగోలు: జిల్లాలో పాల్‌ ల్యాబ్‌ సౌకర్యం ఉన్న 33 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఒక గణితం, ఒక ఆంగ్ల సబ్జక్టు టీచర్లకు శనివారం ఒకరోజు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈవో డి.సుభద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ స్థానిక బండ్లమిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాతోపాటు బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోని 74 పాఠశాలల నుంచి 222 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరవుతారన్నారు.

AP Tenth Supplementary Exams: ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు ఏర్పాట్లు.. షెడ్యూల్ ఇలా!

శిక్షణ కార్యక్రమం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని, శిక్షణకు కేటాయించిన ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు, టీచర్లు తప్పనిసరిగా హాజరుకావాలని, ఎవరికీ మినహాయింపు లేదన్నారు. సంబంధిత డివిజన్‌ విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శిక్షణకు కేటాయించిన వారిని రిలీవ్‌ చేయాలన్నారు.

E Content Generation:అధ్యాప‌కుల‌కు ఈ కంటెంట్ జ‌న‌రేష‌న్‌పై శిక్ష‌ణ‌.. రెండో రోజు ఈ విష‌యాల అవ‌గాహ‌న‌!

Published date : 18 May 2024 04:47PM

Photo Stories