E Content Generation:అధ్యాపకులకు ఈ కంటెంట్ జనరేషన్‌పై శిక్షణ.. రెండో రోజు ఈ విషయాల అవగాహన!
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఏపీ కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ విధానంపై ఇస్తున్న శిక్షణ రెండో రోజు శుక్రవారం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్‌కే మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో నిష్ణాతుల నుంచి నేర్చుకున్న అంశాలను అధ్యాపకులు వారి సబ్జెక్టులలో ఈ కంటెంట్లను తయారు చేయడానికి ఉపయోగించి, దూరవిద్య ద్వారా చదువు కొనసాగిస్తున్న విద్యార్థులతో పాటు కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి నాణ్యమైన విద్యను చేరువ చేయాలన్నారు.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు దూరమైన భారత మహిళా బాక్సర్!!
ఈ కార్యక్రమంలో తమ కళాశాల పాలుపంచుకోవడం తమకెంతో ఆనందాన్నిస్తోందన్నారు. హైదరాబాద్ ఎడ్ జోన్ ఇంటర్నేషనల్‌కు చెందిన డాక్టర్ రామ్‌కుమార్ కృత్రిమ మేధస్సుకు (ఏఐ)కు సంబంధించిన అనేక అంశాలను వివరించి, వాటిని ఈ కంటెంట్ జనరేషన్లో ఎలా ఉపయోగించాలి అనే అంశంపై అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారన్నారు. డాక్టర్ హరినాథ్ శర్మ కృత్రిమ మేధస్సును ఉపయోగించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలాగా, ఆకర్షణీయంగా పాఠ్యాంశాలను ఎలా రూపొందించాలో వివరించారన్నారు.
Training Camp in Library: వేసవి సెలవుల్లో గ్రంథాలయంలో శిక్షణ శిబిరాలు.. సద్వినియోగం చేసుకోండి..
యూనిస్కిల్స్ ఇండియాకు చెందిన ప్రొఫెసర్ ప్రవీణ్‌కుమార్‌శర్మ పాడ్ కాస్టింగ్, ఆడియో ఎడిటింగ్‌పై అధ్యాపకులకు అవగాహన కల్పించారన్నారు. కార్యక్రమానికి బి.వెంకట్రావు, సమన్వయకర్తగా విజయవాడ ఏపీసీసీఈకు చెందిన డాక్టర్ జె.జ్యోతి కన్వీనర్‌గా వ్యవహరించారన్నారు. శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిగ్రీ కళాశాల నుంచి 86 మంది అధ్యాపకులు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలోఎన్.శ్రీనివాస్, సంజీవ్ కుమార్, దేవరాజ్, కిరణ్ కుమార్, ప్రవీణ్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
Telangana is now TG not TS: ఇక నుంచి టీఎస్ కాదు టీజీ.. ఇకపై అన్ని ఇలా..
Tags
- e content generation
- artificial intelligence
- Degree College
- Lecturers
- Training
- second day of training
- Education Department
- Government Degree College
- Principal Ramachandra RK
- Creative E Content Generation
- Technology education
- Technology Development
- Education News
- Sakshi Education News
- East Godavari District News