Telangana is now TG not TS: ఇక నుంచి టీఎస్ కాదు టీజీ.. ఇకపై అన్ని ఇలా..
ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మే 17న అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అటానమస్ సంస్థలతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, అధికారిక డాక్యుమెంట్లు, జీవోలు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, రిపోర్టులు, లెటర్ హెడ్‌లలో ఈ షార్ట్ ఫామ్‌నే వినియోగించాలని పేర్కొన్నారు.
చదవండి: Taj Mahal: మరో తాజ్ మహల్.. ఎక్కడుందో తెలుసా..?
ఈ–కాపీలు, హార్ట్ కాపీల్లోనూ టీజీనే వాడాలని చెప్పారు. ఈ మేరకు అన్ని శాఖలు నివేదికలు అందజేయాలని సీఎస్ కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి.. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ అని వచ్చేలా టీఎస్ అని షార్ట్ ఫామ్‌ని ప్రభుత్వం రిజిస్టర్ చేయించింది. దీంతో అన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా తెలంగాణ స్టేట్ అని వచ్చేలా పేర్లు మారిపోయాయి.