Counselling for Gurukul Inter Admissions: గురుకులంలో ఇంటర్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ!
అనంతపురం: ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకుల కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకులాల సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఏజీ సెట్–2024లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుందని పేర్కొన్నారు. బాలుర గురుకులాల్లోని 154 ఖాళీలు, బాలికల గురుకులాల్లోని 295 ఖాళీల భర్తీకి 1:3 నిష్పత్తిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలురకు సంబంధించి ఎస్‌సీ కేటగిరీలో 22 నుంచి 7,569 ర్యాంకు వరకు, ఎస్టీ 261 నుంచి 5,730, బీసీ 5 నుంచి 403, ఓసీ కేటగిరీలో 19 నుంచి 1023 ర్యాంకు వరకు విద్యార్థులకు ఈ నెల 2న నార్పల మండలం బి.పప్పూరు గురుకులంలో కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు.
Arrangements for Exams: టెన్త్ సప్లిమెంటరీ, డీఈఈ సెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..
● బాలికలకు సంబంధించి ఎస్‌సీ కేటగిరీలో 57 నుంచి 19,371 ర్యాంకు వరకు, బీసీసీ కేటగిరీలో 425 నుంచి 18,483 వరకు, ఎస్టీ 48 నుంచి 12,867, బీసీ 14 నుంచి 1,845, ఓసీ కేటగిరీలో 11 నుంచి 2,128 ర్యాంకు వరకు ఈ నెల 23న అనంతపురం రూరల్ మండలం కురుగుంట గురుకులంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం తొమ్మిది గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందన్నారు. మెరిట్ కార్డు, టెన్త్ మార్కుల మెమో, ఆధార్ కార్డు, కులం, ఆదాయ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
Tags
- Gurukul admissions
- Intermediate
- students education
- counselling
- AP Inter
- Coordinating Officer
- inter admissions counselling
- gurukul inter first year admissions
- Education News
- Sakshi Education News
- ananthapur news
- Ambedkar Gurukula Colleges
- Education in Andhra Pradesh
- Joint district education
- Andhra Pradesh Social Welfare Department
- SakshiEducationUpdates