International Conference at MBU: ఎంబీయూలో సాంకేతిక పురోగతిపై అంతర్జాతీయ సమావేశం
చంద్రగిరి: మండల పరిధిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)లో శనివారం అలైడ్ హెల్త్ కేర్ సాంకేతిక పురోగతిపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించారు. ఎంబీయూ వీసీ ప్రొఫెసర్ నాగరాజ్ రామారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హెల్త్‌కేర్ సైన్స్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ మాధవి, సీఎంసీ వేలూరు ప్రముఖ రేడియోలజిస్టు డాక్టర్ సంతోష్ బాబు, చైన్నె కావేరి ఆస్పత్రి చీఫ్ బయోకెమిస్ట్రీ డాక్టర్ సెల్వకుమార్‌లు హాజరయ్యారు.
NCC Training: ఎన్‌సీసీ శిక్షణతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్..!
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత వైద్య ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాముఖ్యతను వివరించారు. మెడికల్ టెక్నాలజీలో ఏఐ ద్వారా వ్యాధులను నిరూపించడంపై చర్చించారు. అనంతరం రాష్ట్ర హెల్త్‌కేర్ సైన్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మాధవిని సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
Counselling for Gurukul Inter Admissions: గురుకులంలో ఇంటర్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ!