Skip to main content

Tech Layoffs: ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులు.. తొలగింపుల్లో స్పీడు పెంచిన టెక్ కంపెనీలు ఇవే..!

ప్రపంచంలోని ప‌లు దేశాల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి.
Highest dismissals in January, raising concerns about future job cuts.  20000 plus tech employees made layoff in January, 2024   20,000 job cuts in January from 85 tech companies.

జనవరి ప్రారంభం నుంచి ఇప్ప‌టి వరకు 85 టెక్ కంపెనీల నుంచి 20,000 మందిని తొలగించారు. పరిశ్రమలోని దాదాపు 38,000 మందిని గత ఏడాది మార్చిలో తొలగించినదాని కంటే ఇది అధికం. లేఆఫ్స్.ఎఫ్‌ఐ నివేదిక ప్రకారం గత ఏడాది మార్చిలో టెక్‌ కంపెనీలు అత్యధికంగా 38 వేల మందికి ఉద్వాసన పలికాయి. ఆ తర్వాత మళ్లీ ఈ జనవరిలో తొలగింపులు అత్యధికంగా ఉండటం విశేషం. మరింత మందిపై వేటు వేసే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

టెక్నాలజీ సంస్థ శాప్(SAP) ఈ వారం 8,000 మంది, మైక్రోసాఫ్ట్(Microsoft) తన గేమింగ్ విభాగంలో 1,900 మంది, ఫిన్‌టెక్‌ స్టార్టప్ బ్రెక్స్(Fintech startup Breaks) 20 శాతం సిబ్బందిని, ఈబే(eBay) 1,000 మంది, సేల్స్‌ ఫోర్స్‌(Salesforce) సుమారు 700 మందిని ఇంటికి పంపించిన‌ట్లు స‌మాచారం.  
 
దేశీయ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన సిబ్బందిని 5-7 శాతం తగ్గించే పనిలో పడగా.. జొమాటోకు చెందిన క్యూర్‌ఫిట్‌ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా 120 మంది ఉద్యోగులకు ఉ‍ద్వాసన పలికింది. స్విగ్గీ తన ఐపీఓకు ముందే ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందజేయనుంది.

Layoffs: ప్ర‌మాదంలో ఐటీ ఉద్యోగుల భ‌విష్య‌త్‌.. 98% పెరిగిన ఉద్యోగుల తొలగింపులు.. ఎక్క‌డంటే..!

ఈ నెల ప్రారంభంలో గ్లోబల్‌గా గూగుల్‌లో పనిచేస్తున్న వందల ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ధృవీకరించింది. అమెజాన్ తన ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియోస్, ట్విచ్, ఆడిబుల్ విభాగాలలో వందలాది ఉద్యోగాలు ఉపాధి కోల్పోయారు.  

20000 plus tech employees made layoff in January

యూనిటీ తన సిబ్బందిలో 25 శాతం మందిని, గేమర్లు ఉపయోగించే ప్రసిద్ధ మెసేజింగ్ సేవను అందించే డిస్కార్డ్ తన ఉద్యోగులలో 17 శాతం మందిని ఫైర్‌ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే "లీగ్ ఆఫ్ లెజెండ్స్" మల్టీప్లేయర్ బ్యాటిల్ గేమ్ వెనుక ఉన్న వీడియో గేమ్ డెవలపర్ రిమోట్ గేమ్స్(Riot Games) తన సిబ్బందిలో 11 శాతం మందిని ట్రిమ్ చేసింది. 

కాగా చైనీస్ కంపెనీల్లో సైతం ఉద్యోగుల కోతలు సర్వ సాధారణంగా మారిపోయాయి. 2023వ సంవ‌త్స‌రం జనవరిలో 277 టెక్నాలజీ కంపెనీలు దాదాపు 90,000 ఉద్యోగాలను తొలగించినపుడు తొలగింపులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 
అలాగే ఉద్యోగుల తొలగింపుకు మ‌రిన్ని కంపెనీలు రెడీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం పెద్ద కంపెనీలైన ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్ నుంచి మధ్యస్థ టెక్ కంపెనీల వరకు అన్నింటిలో పింక్ స్లిప్స్ ఉద్యోగుల మెడకు ఉరితాడులా వేలాడుతున్నాయి. 

Google Meet Call: ఊడిన‌ ఉద్యోగాలు.. రెండు నిమిషాల్లో 200 మందికి గుడ్‌బై చెప్పిన కంపెనీ..!

Published date : 27 Jan 2024 12:10PM

Photo Stories