Skip to main content

Permanent Judges: వీరిద్ద‌రినీ శాశ్వత న్యాయమూర్తులుగా నియమించండి..

హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
Justice Jaggangari Srinivasa Rao   Justice Namavarapu Rajeshwar Rao  Recommended for Permanent High Court Judge  Telangana High Court Collegium Recommends Two Additional Judges as Permanent Judges

ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్‌లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది.  

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ శ్రీనివాసరావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావులకు తగిన అర్హతలు కలిగి ఉన్నారని నిర్ణయించినట్టు వెల్లడించింది.

తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయమూర్తుల తీర్పులు పరిశీలించాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కమిటీని సీజేఐ ఆదేశించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరించింది.

Amrit Bharat Stations: తెలంగాణలో 15 కొత్త‌ అమృత్ భారత్ స్టేషన్లు ఇవే..

Published date : 18 Apr 2024 03:32PM

Photo Stories