Amrit Bharat Stations: తెలంగాణలో 15 కొత్త అమృత్ భారత్ స్టేషన్లు ఇవే..
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 15 అమృత్ భారత్ స్టేషన్లను నిర్మించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ స్టేషన్లను రూ.230 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్లతో పాటు రూ.169 కోట్లతో 17 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విలువ దాదాపు రూ.621 కోట్లు ఉంటుంది. రాష్ట్రంలోని 40 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి రూ.2,245 కోట్లు. ఇప్పటికే 21 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ భూమి పూజ చేశారు.
రూ.169 కోట్లతో 15 కొత్త అమృత్ భారత్ స్టేషన్లు..
1. జడ్చర్ల – రూ.10.94 కోట్లు.
2. గద్వాల్ – రూ.9.49 కోట్లు.
3. షాద్ నగర్ – రూ.9.59 కోట్లు.
4. మేడ్చల్ – రూ.8.37 కోట్లు.
5. మెదక్ – రూ.15.31 కోట్లు.
6. వాహ నగర్ – రూ.12.37 కోట్లు.
7. బాసర – రూ.11.33 కోట్లు.
8. యాకుత్ పురా – రూ.8.53 కోట్లు.
9. మిర్యాలగూడ – రూ.9.50 కోట్లు.
10. నల్గొండ – రూ.9.50 కోట్లు.
11. వికారాబాద్ – రూ.24.35 కోట్లు.
12. పెద్దపల్లి – రూ.26.49 కోట్లు.
13. మంచిర్యాల – రూ.26.49 కోట్లు.
14. వరంగల్ – రూ.25.41 కోట్లు.
15. బేగంపేట – రూ.22.57 కోట్లు