Amrit Bharat Stations: దేశ వ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవే..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద భారతదేశంలోని రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయికి చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 553 అమృత్ భారత్ స్టేషన్‌ల రైల్వే అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్ల అభివృద్ధికి రూ.19,000 కోట్లు వెచ్చించనున్నారు. 2,000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లలో ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఈ వేడుక నిర్వహించబడుతుంది.
ఈ పథకం కింద 1275 స్టేషన్లను అభివృద్ధి చేస్తుంది. వాటిలో కొన్ని అభివృద్ధి చేయగా మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి కొన్ని స్టేషన్లలో పనులు ప్రారంభం కానున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద, దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న అమృత్ భారత్ స్టేషన్లను రూ.19,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో తిరిగి అభివృద్ధి చేయనున్నారు. ఆయా స్టేషన్‌లలో ఎయిర్ కండిషన్డ్ ఆడిటోరియం, ఫుడ్ కోర్ట్, ఎగువ, దిగువ అంతస్తులలో విశాలమైన పార్కింగ్ స్థలం వంటి ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
Criminal Laws: జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలు
అమృత్ భారత్ స్టేషన్ పథకం అభివృద్ధి చేయబోయే ఈ స్టేషన్‌లు అన్నీ నగరం రెండు చివరలను కలుపుతూ సిటీ హబ్‌లుగా పనిచేస్తాయి. పైకప్పు ప్లాజాలు, అందమైన ల్యాండ్‌స్కేపింగ్, పిల్లల ఆట స్థలాలు, కియోస్క్‌లు , ఫుడ్ కోర్టులు వంటి ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను కలిగి ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో డెవలప్ చేస్తున్న రైల్వే స్టేషన్లు ఇవే..
అమృత్ భారత్ స్టేషన్ల రీడెవలప్‌మెంట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఎపీలోని అనంతపురం, అనపర్తి, ఆదోనీ, బాపట్ల, చీరాల, చిత్తూరు, కంభం, ధర్మవరం, డోన్, ఎలమంచిలి, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గుణదల, గుంటూరు, కడప, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లె, మంగళగిరి, మంత్రాలయం, మార్కాపురం, నడికుడి, నంద్యాల, నర్సరావుపేట, పాకాల, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, సామర్లకొట, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తాడిపత్రి, వినుకొండ సహా మొత్తం 34 రైల్వేస్టేషన్లను ఈ పథకం కింద ఎంపిక చేశారు. తెలంగాణలో జడ్చర్ల, గద్వాల్, షాద్ నగర్, మేడ్చల్ , మెదక్, ఉందా నగర్, బాసర, యకుత్ పురా, మిర్యాలగూడ, నల్గొండ, వికారాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, బేగంపేట్ స్టేషన్లను ఎంపిక చేశారు.