Criminal Laws: జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలు
Sakshi Education
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మూడు నూతన క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ఈ మేరకు నూతన చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24వ తేదీ ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు చట్టంగా మారాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు క్రిమినల్ బిల్లులను పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చింది.
DY Chandrachud: గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి న్యాయ విద్య!!
Published date : 24 Feb 2024 04:37PM