MP Suresh Shetkar: విద్యారంగానికి పెద్దపీట
Sakshi Education
పాపన్నపేట(మెదక్): కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు.
అక్టోబర్ 2న పాపన్నపేటలోని ఎల్లుపేట ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన హెచ్‌ఎం అశోక్‌రెడ్డి పదవీ విరమణ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏడేళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వేసి అనుకున్న సమయానికి ఫలితాలు విడుదల చేశామన్నారు.
చదవండి: Collector Devasahayam: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలి
అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మహిళలకు పాఠశాలల నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పామన్నారు. బీఆర్‌ఎస్ రద్దు చేసిన స్కావెంజర్ వ్యవస్థను తిరిగి అమల్లోకి తీసుకువచ్చామన్నారు. మండలానికో ఎంఈఓను నియమించామని వివరించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు సుంకరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సామ్య, కాంగ్రెస్ నాయకులు నిమ్మ రమేష్, మాన్‌కిషన్, జెడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య, ఎంఈఓ నీలకంఠం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Published date : 03 Oct 2024 05:22PM
Tags
- Education
- MP Suresh Shetkar
- HM Ashok Reddy
- DSC Notification
- Amma Adarsh Committees
- Scavenger System
- Medak District News
- Telangana News
- ZaheerabadMPSureshShetkar
- CongressGovernment
- EducationSectorPriority
- HMAshokReddyRetirement
- EllupetaPrimarySchool
- DSCNotification
- DSCResults
- TeacherRetirement
- EducationInitiatives
- sakshieducation updates