NBEMS Released Examination Calendar: 2024-25 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్
న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS),నీట్-పీజీ,GPAT, సహా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కలిక పరీక్షల షెడ్యూల్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం NBEMS అఫీషియల్ వెబ్‌సైట్ https://natboard.edu.in ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను తెలుసుకోవచ్చు.
NBEMS విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం..
పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష(NEET PG).. జూన్ 23న నిర్వహించనున్నారు. ఇక ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ జులై 6న నిర్వహించనున్నారు.
ఇక ఈ ఏడాది చివర్లో డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామినేషన్(DPEE)ను అక్టోబర్ 5,6 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ పేర్కొంది. మరిన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్ పరీక్షల షెడ్యూల్ కోసం కింది వివరాలను చూడగలరు.