Skip to main content

TS DSC 18 Questions Repeated 2024 : డీఎస్సీ-2024 ప‌రీక్ష‌ల్లో ఇంత దార‌ణ‌మా..! 18 ప్ర‌శ్న‌లు.. మ‌ళ్లీ రోజు అవే 18 ప్ర‌శ్న‌లు వ‌రుస‌గా..? ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌లే ఎన్నో ఆటంకాల మ‌ధ్య డీఎస్సీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ప‌రీక్ష‌లైతే నిర్వ‌హించింది కానీ.. ప‌రీక్ష‌ల్లో కొన్ని ప్ర‌శ్న‌లు త‌ప్పుగా ఇచ్చారు.
TS DSC 2024 DSC exam controversy repeated questions in DSC online exam Telangana education department issues question paper controversy

అలాగే డీఎస్సీ-2024 ఆన్‌లైన్‌ పరీక్షల్లో ఒక విడతలో వచ్చిన 18 సాంఘికశాస్త్రం ప్రశ్నలు మరో రోజు అవే ప్ర‌శ్న‌లు వ‌రుస‌గా పునరావృతమయ్యాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ)-తెలుగు మాధ్యమం పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో రెండు రోజులు అక్షరం మారకుండా ఒకే ప్రశ్నలు రావడం చర్చనీయాంశంగా మారింది. 

☛➤ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

ప్రశ్న సంఖ్య 113 నుంచి 130 వరకు..
సాంఘిక శాస్త్రం నుంచి 18 ప్రశ్నలు ఇచ్చారు. జులై 19వ తేదీ ఉదయం, 23వ తేదీ మధ్యాహ్నం (సెకండ్‌ షిఫ్ట్‌) పరీక్షల్లో వచ్చిన సాంఘికశాస్త్రం ప్రశ్నల‌ సంఖ్య 113 నుంచి 130 వరకు పునరావృతమయ్యాయి. ఒక్క అక్షరం ఒక్క ప్రశ్న తేడా లేకుండా ఇచ్చారు.

☛➤ TS DSC 2024 Results : టీఎస్ డీఎస్సీ -2024 ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఇదే..! సెప్టెంబరు 5వ తేదీలోపు..

జులై 30వ తేదీ ఉదయం పరీక్షలో..
ఈ డీఎస్సీ ప‌రీక్ష‌ల్లో మరికొన్ని రకాల తప్పులు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. జులై 30వ తేదీ ఉదయం పరీక్షలో స్కూల్‌ అసిస్టెంట్‌  సోషల్‌ తెలుగు మాధ్యమం పరీక్షలో కిందివాటిలో ఏది సరైనది అని ఆంగ్లంలో ప్రశ్నను అడగగా.. తెలుగు అనువాదంలో మాత్రం ఏది సరైనది కాదు అని అడిగారు. ఆరు ప్రశ్నలు అదేవిధంగా ఉన్నాయి.

☛➤ TS DSC 2024 Exam Answer Key Mistakes : తెలంగాణ డీఎస్సీ-2024 'కీ' లో ఇన్ని త‌ప్పులా..? ఈ 18 ప్ర‌శ్న‌ల‌కు మార్కుల‌ను..

 2024 జులై 19వ తేదీ ఉదయం, 23వ తేదీ మధ్యాహ్నం (సెకండ్‌ షిఫ్ట్‌) పరీక్షల్లో వచ్చిన సాంఘికశాస్త్రం ప్రశ్నల‌ సంఖ్య 113 నుంచి 130 వరకు పునరావృతమైన ప్ర‌శ్న‌ల పూర్తి వివ‌రాలు ఇవే.. 

Published date : 20 Aug 2024 05:13PM
PDF

Photo Stories