Skip to main content

Urdu Academy: ఉర్దూ భాషాభివృద్ధి కోసం సమష్టి కృషి

సాక్షి, సిటీబ్యూరో: ఉర్దూ భాషాభివృద్ధికి ఇప్పటికే ఉన్న పథకాలను ఉత్తమంగా తీర్చిదిద్దాలని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఉర్దూ అకాడెమీల చైర్మన్లు తాహిర్‌ బిన్‌ హమ్దాన్, మహమ్మద్‌ అలీ ఖాజీ నిర్ణయించారు.
Telangana Urdu Academy Karnataka Urdu academy delegation visits Telangana Karnataka delegations explose Telangana Urdu initiative

ఆగ‌స్టు 14న‌ కర్ణాటక ఉర్దూ అకాడమీ చైర్మన్‌ మహమ్మద్‌ అలీ ఖాజీ నేతృత్వంలోని 15 మంది సభ్యుల ప్రతినిధి బృందం తెలంగాణ ఉర్దూ అకాడమీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది.

అనంతరం జరిగిన సమావేశంలో ఉర్దూ భాషా సాహిత్యాలు, అభివృద్ధికి రెండు రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై చర్చించారు.

చదవండి: Teachers: ఉర్దూ అకాడమీలో టీచర్ల కొరత తీర్చాలి

దక్షిణ భారతదేశంలోని యువ, ప్రతిభావంతులైన ఉర్దూ రచయితలు, కవులను ప్రోత్సహించడానికి, వారి నైపుణ్యాలను పెంపొందించడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలతో కూడిన దక్షిణ భారత ఉర్దూ అకాడమీని స్థాపించడానికి అంగీకరించారు.

ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం విభాగం ప్రొఫెసర్‌ ఎహతేషామ్‌ అహ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ ఉర్దూ జర్నలిస్టులకు ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించడానికి సమన్వయం పెంచాలన్నారు. 

Published date : 15 Aug 2024 04:52PM

Photo Stories