IT Professionals / Engineering Jobs: ఎన్‌టీఆర్‌వో, న్యూఢిల్లీలో 206 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
న్యూఢిల్లీలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్‌టీఆర్‌వో) ఒప్పంద ప్రాతిపదికన ఐటీ ప్రొఫెషనల్స్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 206
పోస్టుల వివరాలు: సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్, రిస్క్ అనలిస్ట్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, టీమ్ లీడర్, హార్డ్‌వేర్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ మెథడ్(క్యూసీబీఎస్) ఆధారంగా ఎంపికచేస్తారు. ఇందులో 80 శాతం క్వాలిటీకి(అర్హతలు, స్కిల్ సెట్, అనుభవం, ఇంటర్వ్యూలో ప్రతిభ) వెయిటేజ్ ఉంటుంది. మిగిలిన 20 శాతం కాస్ట్ బేస్డ్ అంటే ఎక్స్‌పెక్టెడ్ రెమ్యూనరేషన్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 22.04.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.05.2022
వెబ్‌సైట్: https://ntro.gov.in/
చదవండి: BARC Recruitment 2022: బార్క్, ముంబైలో 266 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 16,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |