NTPC Recruitment 2022: ఎన్‌టీపీసీ, జార్ఖండ్‌లో 177 పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..
జార్ఖండ్‌లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌టీపీసీ).. కోల్ మైనింగ్ హెడ్‌క్వార్టర్స్ నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 177
పోస్టుల వివరాలు: మైనింగ్ ఓవర్‌మెన్–74, మైనింగ్ సిర్దార్–103.
మైనింగ్ ఓవర్‌మెన్:
అర్హత: మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. డీజీఎంఎస్ జారీ చేసిన ఓవర్‌మెన్ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 57ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.50,000 చెల్లిస్తారు.
మైనింగ్ సిర్దార్:
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. డీజీఎంఎస్ జారీ చేసిన వాలిడ్ సిర్దార్ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 57 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో 100 మార్కులకి నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని స్కిల్ టెస్ట్‌కి పిలుస్తారు. రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.03.2022
వెబ్‌సైట్: https://ntpc.co.in
చదవండి: NMDC Recruitment 2022: ఎన్‌ఎండీసీ లిమిటెడ్, హైదరాబాద్‌లో 200 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | March 15,2022 |
Experience | 5 year |
For more details, | Click here |