IIT Kanpur Recruitment 2022: 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. నెలకు రూ.69,100 వరకు వేతనం..
కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 119(ఎస్సీ–15, ఎస్టీ–02, ఓబీసీ–34, పీడబ్ల్యూడీ–06, ఈడబ్ల్యూఎస్–11, అన్ రిజర్వ్‌డ్ 51 పోస్టులు)
అర్హతలు
- కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వీరికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. దీంతోపాటు ఎస్టాబ్లిష్‌మెంట్ మేటర్స్/ఆర్ అండ్ డీ/లీగల్/పర్చేస్ అండ్ ఇంపోర్ట్/అకౌంట్స్ /ఆడిట్/హాస్పిటాలిటీ మొదలైన విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయసు: 09.11.2022 నాటికి 21–30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఐఐటీ కాన్పూర్‌లో పనిచేసే ఉద్యోగులకు గరిష్ట వయసు 50 ఏళ్లుగా నిర్ణయించారు. వీరికి తగిన విద్యార్హతలు ఉండాలి.
వేతనాలు: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పే లెవల్ –03 ప్రకారం–నెలకు రూ.21,700–రూ.69,100 వరకు వేతనంగా పొందుతారు.
ఎంపిక ఇలా: వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేయడం,రాత పరీక్ష/జాబ్ ఓరియెంటెడ్ ప్రాక్టికల్ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను ఈ–మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
- దరఖాస్తులకు చివరి తేదీ: 09.11.2022
- వెబ్‌సైట్ : https://www.iitk.ac.in/new/recruitment
చదవండి: IIT Recruitment 2022: ఐఐటీ తిరుపతిలో 39 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 09,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |