Skip to main content

5043 Jobs in Food Corporation of India: నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక విధానం, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ టిప్స్‌...

FCI Job Notification

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులకు.. తీపికబురు! కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ).. భారీ సంఖ్యలో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో.. అయిదు జోన్ల పరిధిలో మొత్తం 5,043 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. డిప్లొమా, డిగ్రీ అర్హతలతో కొలువు సొంతం చేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. ఎఫ్‌సీఐ ఉద్యోగ నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక విధానం, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ టిప్స్‌... 

  • ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌
  • పలు విభాగాల్లో 5 వేలకుపైగా నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌లు
  • డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం
  • రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా నియామకాలు ఖరారు

పదో తరగతి నుంచి ప్రొఫెషనల్‌ డిగ్రీ విద్యార్థుల వరకూ.. తమ అర్హతలకు సరితూగే ప్రభుత్వ కొలువులు కోసం ఎంతో మంది అన్వేషిస్తుంటారు. అందుకోసం ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. అలాంటి వారికి మరో చక్కటి అవకాశం.. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) విడుదల చేసిన తాజా జాబ్‌ నోటిఫికేషన్‌.

చ‌ద‌వండి: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గ్రేడ్ III పోస్టుల పరీక్షా సరళి 2022 

5 జోన్లు, 5,043 పోస్ట్‌లు

  • ఎఫ్‌సీఐ జాతీయ స్థాయిలో అయిదు జోన్ల పరిధిలో.. నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ హోదాలోని ఎనిమిది కేడర్‌లలో 5,043 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి సౌత్‌ జోన్‌లో 898 ఖాళీలు ఉన్నాయి.
  • ప్రారంభ వేతన శ్రేణి ఆయా పోస్టును అనుసరించి కనిష్టంగా రూ.28,200 - 79,200; గరిష్టంగా రూ.34,000 - 1,03,400గా ఉంది. 

అర్హతలు

  • అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ(అగ్రికల్చర్‌/బోటనీ/జువాలజీ/బయో టెక్నాలజీ/బయో కెమిస్ట్రీ/మైక్రో బయాలజీ/ ఫుడ్‌ సైన్స్‌), బీఈ/బీటెక్‌(ఫుడ్‌ సైన్స్‌/ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ)/ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌/బయో టెక్నాలజీ/సివిల్‌ ), డిప్లొమా(సివిల్‌/మెకానికల్‌) /ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వయసు: పోస్టును అనుసరించి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. 
  • అభ్యర్థుల విద్యార్హతలు, వయో పరిమితి విషయంలో ఆగస్ట్‌ 1, 2022ను కటాఫ్‌ తేదీగా పరిగణిస్తారు. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

చ‌ద‌వండి: TSPSC Notification 2022: 181 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఎంపిక విధానం

  • ఆయా పోస్ట్‌లకు రెండు దశల రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫేజ్‌-1, ఫేజ్‌-2 పేరుతో ఆన్‌లైన్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. స్టెనో పోస్టులకు స్కిల్‌/టైపింగ్‌ టెస్ట్‌ ఉంటాయి. 

ఫేజ్‌-1 పరీక్ష ఇలా

ఫేజ్‌-1 పరీక్ష నాలుగు విభాగాల్లో 100 ప్రశ్నలు100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు-25 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 25 ప్రశ్నలు-25 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్‌ స్టడీస్‌ 25 ప్రశ్నలు-25 మార్కులకు ఉంటాయి. ప్రశ్నలు అబ్జెక్టివ్‌ విధానంలో అడుగుతారు. నెగెటివ్‌ మార్కుల నిబంధన అమల్లో ఉంది.

ఫేజ్‌-2.. వేర్వేరుగా

  • ఫేజ్‌-1లో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఆయా పోస్ట్‌లకు సంబంధించి ఒక్కో ఖాళీకి 15 మంది చొప్పున(1:15 నిష్పత్తి) అభ్యర్థులను ఫేజ్‌-2 పరీక్షకు ఎంపిక చేస్తారు.
  • ఫేజ్‌-2లోనూ ఆయా పోస్ట్‌లను అనుసరించి పేపర్‌-1, పేపర్‌-2, పేపర్‌-3లు ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌ను బట్టి ఆయా పేపర్‌లకు హాజరు కావాల్సి ఉంటుంది.
  • జూనియర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లకు పోటీ పడే వారు పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 
  • స్టెనో గ్రేడ్‌-2 ఔత్సాహికులకు పేపర్‌-3ని నిర్వహిస్తారు.
  • ఏజీ3(జనరల్‌ అభ్యర్థులు) పేపర్‌-1కు, ఏజీ-3(అకౌంట్స్‌), ఏజీ-2(టెక్నికల్‌) అభ్యర్థులు పేపర్‌-1, పేపర్‌-2లకు హాజరు కావాలి.
  • ఏజీ-3(డిపో) అభ్యర్థులు పేపర్‌-1 కు హాజరు కావాలి. 
  • ఏజీ-3(హిందీ) అభ్యర్థులు పేపర్‌-1, పేపర్‌-2లకు హాజరు కావాలి.

ఫేజ్‌-2.. పేపర్‌-1 ఇలా

ఫేజ్‌-2లో పేపర్‌-1 పరీక్ష నాలుగు విభాగాల్లో 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 25 ప్రశ్నలు, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు, న్యూమరికల్‌ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ స్టడీస్‌ నుంచి 45 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు.

పేపర్‌-2 సబ్జెక్ట్‌ సంబంధ ప్రశ్నలు

ఫేజ్‌-2లోని పేపర్‌-2ను సబ్జెక్ట్‌ సంబంధిత పేపర్‌గా పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌ను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్‌లో 60 ప్రశ్నలతో 120 మార్కులకు ఈ పేపర్‌ను నిర్వహిస్తారు.

చ‌ద‌వండి: FCI Recruitment 2022: ఎఫ్‌సీఐలో 113 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.1,40,000 వ‌ర‌కు వేతనం..

పేపర్‌-3

ఫేజ్‌-2 పరీక్షలో.. స్టెనో గ్రేడ్‌3 అభ్యర్థులకు మాత్రమే నిర్వహించే పేపర్‌-3 పరీక్ష నాలుగు విభాగాల్లో 120 మార్కులకు ఉంటుంది. జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంటెలిజెన్స్, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌(ఎంఎస్‌ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్‌ అండ్‌ ఇంటర్నెట్‌ తదితర అంశాలు) విభాగాల నుంచి 30 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.

ఫేజ్‌-2లో ప్రతిభ ఆధారంగా

ఫేజ్‌-2లో నిర్వహించిన రాత పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి.. తుది నియామకాలు ఖరారు చేస్తారు. స్టెనో గ్రేడ్‌-2 అభ్యర్థులకు తదుపరి దశలో ఇంగ్లిష్‌ టైపింగ్,షార్ట్‌ హ్యాండ్‌లో స్కిల్‌ టెస్ట్‌ కూడా నిర్వహిస్తారు. 

విజయం సాధించాలంటే
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్‌ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్, యాక్టివ్‌/ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, స్పెల్లింగ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్‌ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి రోజు ఇంగ్లిష్‌ దినపత్రికలను చదవడం, వాటిలోని ముఖ్యాంశాల సారాంశాన్ని రాసుకోవడం వంటివి చేయాలి.

రీజనింగ్‌ ఎబిలిటీ

వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. సిరీస్‌(నంబర్‌/ఆల్ఫాన్యుమరిక్‌) విభాగం, అనాలజీస్, ఆడ్‌ మెన్‌ ఔట్, సిలాజిజమ్, మ్యాట్రిక్స్, డైరెక్షన్, వర్డ్‌ ఫార్మేషన్, బ్లడ్‌ రిలేషన్స్, నాన్‌ వెర్బల్‌(వాటర్‌ ఇమేజ్, మిర్రర్‌ ఇమేజ్‌), కోడింగ్‌-డీకోడింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి.

న్యూమరికల్‌ ఎబిలిటీ

ఈ విభాగంలో అర్థగణిత అంశాలైన సింపుల్‌ ఇంట్రెస్ట్, కాంపౌండ్‌ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, ప్రాఫిట్‌ అండ్‌ లాస్,శాతాలపై ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా, త్రికోణమితి, అల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్‌ వర్క్, టైం అండ్‌ డిస్టెన్స్‌లకు సంబంధించిన ప్రశ్నలను కూడా ప్రాక్టీస్‌ చేయాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌

జనరల్‌ అవేర్‌నెస్‌లో జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు మొదలు జనరల్‌ సైన్స్, ఎకానమిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ విభాగాలపై దృష్టి పెట్టాలి. హిస్టరీకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలపై ప్రత్యేక దృష్టితో చదవాలి. జాగ్రఫీలో సహజ వనరులు, నదులు, పర్వతాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఎకనామిక్స్‌కు సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక వాణిజ్య రంగాల్లో ఏర్పడిన కీలక పరిణామాలపై దృష్టి పెట్టాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పదజాలంపైనా పట్టు సాధించాలి. సమకాలీన అంశాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్టాక్‌ జీకే విషయంలో చరిత్రలో ముఖ్యమైన వ్యక్తులు, తేదీలు, సదస్సులు, సమావేశాలువాటి తీర్మానాలు, అవార్డులువిజేతలు వంటి సమాచారాన్ని ఔపోసన పట్టాలి.

పేపర్‌-2 కోసం ప్రత్యేకంగా

  • అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌పై జరిగే పేపర్‌-2లో రాణించడానికి అకడమిక్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. 
  • ఏజీ-3 అకౌంట్స్‌ పోస్ట్‌ల అభ్యర్థులు బుక్‌ కీపింగ్, బీఆర్‌ఎస్, జీఎస్‌టీ, ఆడిటింగ్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
  • సివిల్‌ ఇంజనీరింగ్‌ పోస్ట్‌ల అభ్యర్థులు బిల్డింగ్‌ మెటీరియల్స్, సర్వేయింగ్, సాలిడ్‌ మెకానిక్స్, ఎస్టిమేటింగ్, కాస్టింగ్‌ అండ్‌ ఎవాల్యుయేషన్, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలను చదవాలి.
  • ఎలక్ట్రికల్, మెకానికల్‌ ఇంజనీర్‌ అభ్యర్థులు కరెంట్, ఓల్టేజ్, పవర్, ఎనర్జీ, సర్క్యూట్‌ లా, ఎలక్ట్రికల్‌ మెషీన్స్, పవర్‌ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్, థియరీ ఆఫ్‌ మెషీన్స్, మెషీన్‌ డిజైన్, ఇంజనీరింగ్‌ మెకానిక్స్, స్ట్రెంగ్త్‌ ఆఫ్‌ మెటీరియల్, థర్మల్‌ ఇంజనీరింగ్, బాయిలర్‌ రిఫ్రిజిరేషన్‌ సైకిల్స్, ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌కు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

ఎఫ్‌సీఐ రిక్రూట్‌మెంట్‌.. ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 5, 2022 
  • ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: జనవరి, 2023లో నిర్వహించే అవకాశం
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఫేజ్‌-1: నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌; ఫేజ్‌-2: విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్‌
  • వెబ్‌సైట్‌: https://www.recruitmentfci.in/

చ‌ద‌వండి: FCI Recruitment: 5043 కేటగిరి3 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories