FCI Recruitment 2022: ఎఫ్‌సీఐలో 113 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.1,40,000 వరకు వేతనం..
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న న్యూఢిల్లీలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ).. దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 113(జోన్ల వారీగా ఖాళీలు: నార్త్‌జోన్-38, సౌత్‌జోన్-16, వెస్ట్‌జోన్-20,ఈస్ట్‌జోన్-21,నార్త్‌ఈస్ట్‌జోన్-18)
విభాగాలు: జనరల్, డిపొ, మూవ్‌మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్, హిందీ
అర్హతలు
- పోస్టులను అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, బీకాం, బీఎస్సీ,బీటెక్/బీఈ, సీఏ,సీఎస్, ఐసీడబ్ల్యూఏ,ఎంఏ,ఎంబీఏ,పీజీడీఎం,పీజీ డిప్లొమా, ఐసీఏఐ తదితర విద్యార్హతలను కలిగి ఉండాలి.
- వయసు: పోస్టులను అనుసరించి 01.08.2022 నాటికి 35ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
వేతనాలు
- ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రతి నెల రూ.40,000-రూ.1,40,000 వేతన శ్రేణి లభిస్తుంది.
ఎంపిక ఇలా
- ఫేజ్-1,2 ఆన్‌లైన్ పరీక్ష,ఇంటర్వ్యూ,శిక్షణ ఆ«ధారంగా అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
- ఫేజ్-1: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి నాల్లో వంతు మార్కు కోత వి«ధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇంగ్లిష్ , హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు-25 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ 25 ప్రశ్నలు-25 మార్కులు; న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-25 మార్కులు; జనరల్ స్టడీస్ (ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ అండ్ జనరల్ సైన్స్‌ల నుంచి 20 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి 5 ప్రశ్నలు) విభాగాల నుంచి 25 ప్రశ్నలు-25 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- ఫేజ్-2: ఈ పరీక్ష మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహిస్తారు. ఎంపిక చేసుకునే పోస్ట్ కోడ్‌ను అనుసరించి ప్రశ్నపత్రం ఉంటుంది. పేపర్-1.. 120 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. పేపర్-2.. 120 మార్కులకు 60 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. అలాగే పేపర్ -3.. 120 మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో జరుగుతుంది. పేపర్-4.. 120 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు.
పరీక్ష కేంద్రాలు(ఫేజ్-1): వరంగల్, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: 26.09.2022
- పరీక్ష తేదీ: డిసెంబర్, 2022
- వెబ్‌సైట్: https://fci.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 26,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |